Deepika Padukone: వెంకన్న సన్నిధిలో బాలీవుడ్ హీరోయిన్.. తిరుమలలో సందడి చేసిన దీపికా పదుకొనె
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనె తిరుమలకు చేరుకున్నారు. గురువారం రాత్రి అలిపిరి మెట్లమార్గం ద్వారా మూడున్నర గంటలపాటు నడుచుకుంటూ దీపికా తిరుమలకు చేరుకున్నారు. బ్లాక్ డ్రెస్సులో, వ్యక్తిగత సిబ్బంది వెంటరాగా.. గోవింద నామస్మరణ చేస్తూ అలిపిరి మార్గంలో నడక సాగించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనె తిరుమలకు చేరుకున్నారు. గురువారం రాత్రి అలిపిరి మెట్లమార్గం ద్వారా మూడున్నర గంటలపాటు నడుచుకుంటూ దీపికా తిరుమలకు చేరుకున్నారు. బ్లాక్ డ్రెస్సులో, వ్యక్తిగత సిబ్బంది వెంటరాగా.. గోవింద నామస్మరణ చేస్తూ అలిపిరి మార్గంలో నడక సాగించారు. తిరుమల నడక మార్గంలో దీపికాను చూసిన భక్తులు ఆశ్చర్యపోయారు.. ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. దీపికాకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. రాత్రి రాధేయం అతిధి గృహంలో బసచేసిన దీపికా శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆ వేంకటేశ్వర స్వామివారిన దర్శనం చేసుకోనున్నారు.