‘జీవితంలో దొరికిన గొప్ప గిఫ్ట్’ పవన్‌తో స్నేహం పై ఆనంద్ సాయి ఎమోషనల్
పవన్ కళ్యాణ్ కి చాలా తక్కువ మంది స్నేహితులు ఉంటారు. అలాంటి వారిలో ఆనంద్ సాయి ఒకరు. పవన్ కళ్యాణ్ – ఆర్ట్ డైరెక్టర్, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. తొలిప్రేమ సినిమా నుంచి వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కంటిన్యూ అవుతున్నారు. ఇద్దరూ వారి వారి రంగాల్లో పైకి ఎదిగారు. ఎంత ఎదిగినా ఇద్దరి స్నేహం మాత్రం వదల్లేదు. ఎవరి బిజీలో వారున్నప్పటికీ ఒకరిని ఒకరు మర్చిపోకుండా ఇప్పటికీ అలాగే తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.
ఇక రాజకీయాల్లోకి వచ్చాక కూడా పవన్ కల్యాణ్, ఆనంద్ సాయి ఫ్రెండ్ షిప్ అలాగే కంటిన్యూ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎంగా సేవలు అందిస్తుండగా ఆనంద్ సాయి టీటీడీ బోర్డు మెంబర్ గా కొనసాగుతున్నారు. ఈక్రమంలోనే పవన్ కల్యాణ్ పాల్గొనే ప్రతీ ఆధ్యాత్మిక కార్యక్రమంలోనూ ఆనంద్ సాయి పాల్గొంటున్నారు. రీసెంట్‌గా పవన్ కల్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లోని పలు పుణ్య క్షేత్రాలను దర్శించుకున్నారు. కుమారుడు అకీరా నందన్, ఆనంద్ సాయి లతో కలిసి కేరళ, తమిళనాడులోని పలు దేవాలయాలను సందర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆనంద్ సాయి పవన్ కళ్యాణ్ తో దిగిన ఓ ఫోటో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘జీవితంలో గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉందంటే అది స్నేహం మాత్రమే. అది నాకు దొరికింది. ఎప్పట్నుంచో మేము ఈ ఆధ్యాత్మిక యాత్ర కోసం కలలు కన్నాం. ఈ కోరికే మమ్మల్ని మరింత దగ్గరగా ఉంచింది. మూడు దశాబ్దాల తర్వాత ఇప్పటికి అది నెరవేరింది. మునుపెన్నడూ లేని విధంగా దివ్య ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టాం’ అని రాసుకొచ్చారు ఆనంద సాయి. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prudhvi Raj: ట్విట్టర్ ఖాతా తెరిచిన పృథ్వీ! అప్పుడే మళ్లీ రచ్చ షురూ…
ఊరికే పనిచేస్తా.. ఉద్యోగం ఇవ్వండి ప్లీజ్.. ఓ టెక్కీ ఆవేదన
బర్త్‌డే పార్టీలో కేకుపై క్యాండిల్ వెలిగించిన యువతి.. క్షణాల్లో
రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే రూ.10 లక్షలు.. పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్
వీళ్ల కరెంట్ బిల్‌తో.. విల్లా కొనేయొచ్చు !! షాకిస్తున్న హీరోల కరెంట్ బిల్

ఆరేళ్లుగా ఆఫీసుకు వెళ్లకపోయినా నెలనెలా జీతం.. చివరికి..

యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్ ఏం జరిగిందంటే? వీడియో

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో

గుడ్లు పెట్టే వరకేనండోయ్.. ఆ తర్వాత తల్లి పక్షి జంప్ ..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో
