ఊరికే పనిచేస్తా.. ఉద్యోగం ఇవ్వండి ప్లీజ్.. ఓ టెక్కీ ఆవేదన
చదువుపూర్తయి రెండేళ్లయినా ఉద్యోగం దొరక్క ఓ టెక్ గ్రాడ్యుయేట్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అనుభవం లేదంటూ ఎదుర్కొన్న తిరస్కరణలతో కొత్త ఆలోచన చేశారు. దానినే ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఇప్పుడు ఆ పోస్టు నెట్టింట్లో వైరల్‌గా మారింది. నిరుద్యోగంతో నిరాశ చెందిన ఓ బెంగళూరు గ్రాడ్యుయేట్ తన రెజ్యుమ్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. 2023లో ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో బీఈ పూర్తి చేసానని, ప్రస్తుతం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నానని తెలిపారు.
ఈ ఉద్యోగ అన్వేషణలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నానని, అనుభవం లేదంటూ ఎవరూ ఉద్యోగం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తన రెజ్యూమ్‌ను పక్కనపడేసినా పర్లేదు.. ఉచితంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను..దయచేసి ఉద్యోగం ఇచ్చి సహాయం చేయండి అంటూ అభ్యర్ధించారు. జావా, పైథాన్, క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్ తదితర కోర్సుల్లో తనకు ప్రావీణ్యం ఉందన్నారు. ఇలా పనిచేయడం వల్ల కనీసం అనుభవమైనా వస్తుందని ఆ టెకీ భావిస్తున్నారు. ఈ పోస్టుపై పలువురు స్పందించారు. కొందరు సలహాలు, సూచనలు చేశారు. సీవీని మరింత మెరుగ్గా సిద్ధం చేసుకోమని సూచించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బర్త్‌డే పార్టీలో కేకుపై క్యాండిల్ వెలిగించిన యువతి.. క్షణాల్లో
రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే రూ.10 లక్షలు.. పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్
వీళ్ల కరెంట్ బిల్‌తో.. విల్లా కొనేయొచ్చు !! షాకిస్తున్న హీరోల కరెంట్ బిల్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

