వీళ్ల కరెంట్ బిల్‌తో.. విల్లా కొనేయొచ్చు !! షాకిస్తున్న హీరోల కరెంట్ బిల్
స్టార్ హీరోలు, హీరోయిన్ల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ఆ నటుడి ఆస్తి ఎంత? వాళ్ళ జీతం ఎంత? వాళ్ళ దగ్గర ఏ కార్లు ఉన్నాయి? ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరి పెద్ద పెద్ద లగ్జీ ఇళ్లల్లో నివసించే బాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లకు విద్యుత్ బిల్లు ఎంత ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా చాలా మందికి ఉంటుంది.
అలాంటి వారి కోసమే ఈ న్యూస్. బాలీవుడ్‌లోని చాలా మంది సెలబ్రిటీలకు ముంబైలో సొంత ఇళ్లు ఉన్నాయి. షారుఖ్ ఖాన్ నివాసం ‘మన్నత్’, అమితాబ్ బచ్చన్ విలాసవంతమైన బంగ్లాలతో ఇతర హీరోల నివాసాలు కూడా బాంద్రాలోనే ఉన్నాయి. ఇక సెలబ్రిటీలు తమ ఇళ్లు అందంగా కనిపించాలని కోరుకుంటారు. ఇందుకోసం తమ నివాసాలను రంగు రంగుల లైట్లు, దీపాలతో అందంగా అలంకరిస్తారు. మరి అలాంటి సెలబ్రిటీల ఇళ్లకు పవర్‌బిల్ ఎంత కడుతున్నారో తెలిస్తే మీరు షాకవ్వాల్సిందే! కింగ్ ఖాన్ షారుఖ్ షారుఖ్ ఖాన్ కు ముంబైలో ‘మన్నత్’ అనే పేరు మీద ఇల్లు ఉంది. ఇది చాలా పెద్దది. ఈ ఇంట్లో చాలా గదులు ఉన్నాయి. ఈ ఇంటి కోసం షారుఖ్ ఖాన్ ప్రతి నెలా రూ.43-45 లక్షల విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇక సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో డిమాండ్ ఉన్న మరో స్టార్ హీరో. అతనికి ముంబైలో చాలా ఆస్తులు ఉన్నాయి. ప్రస్తుతం సల్లు గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. అతను ప్రతి నెలా 23-25 లక్షల రూపాయల విద్యుత్ బిల్లు చెల్లిస్తాడని సమాచారం. ఇక అమితాబ్ బచ్చన్ ఎన్నో ఏళ్ల నుంచి బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నారు. ఆయనకు జుహులో సొంత బంగ్లా ఉంది. ఇందుకోసం బిగ్ బీ ప్రతి నెలా రూ.22-25 లక్షల విద్యుత్ బిల్లు చెల్లిస్తారట. అయితే ఇప్పుడీ స్టార్ హీరోల కరెంట్ బిల్లు లెక్క నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అందర్నీ షాకయ్యేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరో గుడ్ న్యూస్ చెప్పనున్న అక్కినేని ఫ్యామిలీ..
Monalisa: మోనాలిసా గొప్ప మనసుకు జనం ఫిదా..
ప్రతిరోజూ పెరుగు తీసుకుంటే జరిగేది ఇదే

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
