Allu Arjun - Allu Arha: యానిమల్ సాంగ్‌కు డ్యాన్స్‌ ఇరగదీసిన అల్లు అర్హ.. వీడియో వైరల్.

Allu Arjun – Allu Arha: యానిమల్ సాంగ్‌కు డ్యాన్స్‌ ఇరగదీసిన అల్లు అర్హ.. వీడియో వైరల్.

Anil kumar poka

|

Updated on: Feb 25, 2024 | 1:19 PM

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్, కూతురు అల్లు అర్హల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా అల్లు అర్హ ఇప్పటికే హీరోయిన్లతో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ ను సొంతం చేసుకుంది. అర్హ అల్లరి వీడియోలు, ఫొటోలను తరచూ సోషల్‌ మీడియాలో షేర్ చేస్తుంటారు అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులు. దీంతో స్టార్ కిడ్ గా ఇప్పటికే మస్త్ క్రేజ్ సంపాదించుకుంది అల్లు అర్హ.

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్, కూతురు అల్లు అర్హల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా అల్లు అర్హ ఇప్పటికే హీరోయిన్లతో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ ను సొంతం చేసుకుంది. అర్హ అల్లరి వీడియోలు, ఫొటోలను తరచూ సోషల్‌ మీడియాలో షేర్ చేస్తుంటారు అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులు. దీంతో స్టార్ కిడ్ గా ఇప్పటికే మస్త్ క్రేజ్ సంపాదించుకుంది అల్లు అర్హ. తాజాగా యానిమల్ సినిమాలో సూపర్ హిట్‌ పాటకు సూపర్బ్‌ గా స్టెప్పులేసింది బన్నీ గారాల పట్టి. ‘జమల్ కుదు’ సాంగ్ ను తనదైన శైలిలో రీక్రియేట్ చేసింది అర్హ. ఒరిజినల్‌ పాటలో తలపై గ్లాస్ పెట్టుకుని బాబీ డియోల్‌ డ్యాన్స్ చేస్తే బన్నీ కూతురు మాత్రం తలపై ప్లేట్ పెట్టుకుని స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. బన్నీ కూతురంటే ఆ మాత్రం ఉండాల్సిందే.. క్యూట్‌ డ్యాన్స్ అంటూ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. ఇక సమంత నటించిన శాకుంతలం సినిమాలో అల్లు అర్హ నటించింది. ఇందులో తను పోషించిన భరతుడి పాత్రకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ల కాంబినేషన్‌లో వస్తోన్న దేవరలోనూ అల్లు అర్హ నటించనుందని ప్రచారం సాగుతోంది. జాన్వీ చిన్నప్పట పాత్రలో అర్హ కనిపించనుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై బన్నీ ఫ్యామిలీ కానీ, దేవర టీమ్‌ కానీ ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..