శ్రీదేవి ఇల్లు అద్దెకిస్తారట.. జాన్వి మీతో ముచ్చట్లాడుతుంది కూడా

అలనాటి నటి శ్రీదేవి టాలీవుడ్‌, బాలీవుడ్‌లో స్టార్‌ నటిగా ఎదిగి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చెన్నైలో శ్రీదేవికి ఓ విలాసవంతమైన ఇల్లు ఉంది. నిర్మాత బోనీ కపూర్‌తో వివాహం అనంతరం తొలిసారి ఓ బీచ్‌ హౌజ్‌ను శ్రీదేవి కొనుగోలు చేశారు. శ్రీదేవి నటిగా తన కెరీర్‌లో బిజీగా ఉన్న టైమ్‌లో చెన్నైలోనే ఎక్కువ సమయం గడపాల్సి వచ్చేది. దీంతో ఎంతో ముచ్చటపడి ఓ ఇంటిని కొనుగోలు చేశారు.

శ్రీదేవి ఇల్లు అద్దెకిస్తారట.. జాన్వి మీతో ముచ్చట్లాడుతుంది కూడా

|

Updated on: May 07, 2024 | 7:46 AM

అలనాటి నటి శ్రీదేవి టాలీవుడ్‌, బాలీవుడ్‌లో స్టార్‌ నటిగా ఎదిగి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చెన్నైలో శ్రీదేవికి ఓ విలాసవంతమైన ఇల్లు ఉంది. నిర్మాత బోనీ కపూర్‌తో వివాహం అనంతరం తొలిసారి ఓ బీచ్‌ హౌజ్‌ను శ్రీదేవి కొనుగోలు చేశారు. శ్రీదేవి నటిగా తన కెరీర్‌లో బిజీగా ఉన్న టైమ్‌లో చెన్నైలోనే ఎక్కువ సమయం గడపాల్సి వచ్చేది. దీంతో ఎంతో ముచ్చటపడి ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు ఎంతో ఖరీదైన, ఎన్నో విశేషాలు కలిగిన శ్రీదేవి ఇంట్లో నివసించే అవకాశాన్ని కల్పించింది అంతర్జాతీయ సంస్థ airbnb. ఆశ్చర్యపోతున్నారా..? మీరు విన్నది నిజమే. శ్రీదేవి నివసించిన ఆ విలాసవంతమైన మాన్షన్‌ను ఇప్పుడు రెంట్‌కు ఇవ్వనున్నారు. ప్రముఖ రెంటల్‌ సంస్థ ఐకాన్స్‌ లో భాగంగా ప్రపంచంలోని 11 సెలబ్రిటీల ఇళ్లను రెంట్‌కు అందిస్తుంది. వాటిల్లో ఒకటి శ్రీదేవి ఇల్లు కావడం విశేషం. శ్రీదేవి ఇంట్లో ఇద్దరు అతిథులకు మాత్రమే అవకాశం ఉంటుంది. వారికి ఒక బెడ్‌రూమ్‌, ఒక బాత్రూమ్‌ యాక్సెస్‌ లభిస్తుందని రెంటల్‌ సంస్థ పేర్కొంది. ఈ ఇంటి కోసం బుకింగ్స్‌ మే 12వ తేదీన ప్రారంభం కానున్నట్లు సదరు సంస్థ తెలిపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??

Kalki 2898 AD: కల్కి నుంచి ఫస్ట్ సింగిల్‌ వస్తోందోచ్‌.. ఎప్పుడంటే ??

Vishal: టాప్ పొలిటీషియన్ బయోపిక్‌లో విశాల్‌ హీరో !!

ఆ టాప్ హీరో చెల్లిగా అంటే నయన్‌ ఒప్పుకుంటారా ?? ఇంతకీ ఆ హీరో ఎవరంటే ??

Vishwambhara: 18 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే కాంబినేషన్ అంటే మాటలు కాదు మరి

Follow us
Latest Articles