కూరగాయలతో పోటీ పడుతున్న గుడ్డు ధర
సామాన్యులను కలవరపెడుతున్న కూరగాయలు, గుడ్ల ధరల పెరుగుదలపై విశ్లేషణ. కిలో రూ.80-100 చేరిన కూరగాయలు, రూ.7-8 పలికే గుడ్ల ధరలు జనాన్ని పరేషాన్ చేస్తున్నాయి. కార్తీక మాసం, డిమాండ్ తగ్గినా సరఫరా లేకపోవడంతో ధరలు అమాంతం పెరిగాయి. ఈ ద్రవ్యోల్బణం వెనుక కారణాలు, సామాన్యులపై దీని ప్రభావంపై సమగ్ర సమాచారం.
ఓవైపు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుడికి దడ పుట్టిస్తుంటే..మరోవైపు గుడ్డు ధర కూడా దూసుకెళ్తోంది. కూరగాయలు ఏది కొనాలన్నా ప్రస్తుతం కేజీ 80 నుంచి 100 రూపాయలు పలుకుతున్నాయి. ధరలు ఇలా మండిపోతుంటే ఏం కొనాలి? ఏం తినాలి అని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారీక మాసం ఆరంభానికి ముందున్న పరిస్థితులు.. ఇప్పుడు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కిలో రూ.20 అమ్మిన కూరగాయలు ఇప్పుడు సెంచరీ కొడుతున్నాయి. ఓ వైపు పెరిగిన కూరగాయల ధరలు సామాన్య, మధ్య తరగతి జనాలకు చుక్కలు చూపిస్తుంటే.. మరో వైపు కోడిగుడ్ల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. కూరగాయలు ఎక్కువ శాతం కిలో వంద రూపాయలకు చేరుకుంటే.. కోడిగుడ్డు సైతం తగ్గేదే లే.. అంటూ ఏడు రూపాయలకు చేరింది. దీంతో వినియోగదారులు వీటిని కొనలేక లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం కార్తీక మాసం ఉపవాసాలతోపాటు అయ్యప్ప దీక్షలు కూడా తీసుకునే సమయం. ఈ సమయంలో గుడ్లు వినియోగం సాధారణంగా తక్కువగా ఉంటుంది. అయితే ఇందుకు భిన్నంగా ఈసారి గుడ్డు ధరలు అమాంతం పెరిగాయి. గత నెలలో రూ.5 నుంచి రూ.6 విక్రయించిన గుడ్డు.. ప్రస్తుతం రూ.7 నుంచి రూ.8 లు పలుకుతోంది. ఇక డజను గుడ్లు రూ.98 వరకు పలుకుతున్నాయి. దీంతో జనాలు గుడ్లు కొనాలంటే ఆలోచించాల్సి వస్తోంది. ఇక ఈ ధరల పెరుగుదలకు కారణం.. డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా లేకపోవడమే అని వ్యాపారులు చెబుతున్నారు. అక్టోబరులో కిలో చికెన్ రూ.240 నుంచి రూ.260 ఉంటే.. ప్రస్తుతం రూ.20 నుంచి రూ.40 వరకు తగ్గింది. మాంసం ధరలు తగ్గితే గుడ్డు రేటు మాత్రం పైపైకి వెళ్లడం విడ్డూరంగా ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిట్టీలు కట్టించుకుని మోసం చేసిన మహిళ.. బాధితులు ఏం చేశారంటే
చిన్నారి చేసిన పనికి చలించిపోయిన దొంగ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే ??
ఉచితగా AI కోర్స్ ఈ విధంగా నేర్చుకోండి.. జీవితంలో సెటిల్ అవ్వండి
సార్ టాలెంట్ మామూలుగా లేదు.. స్మగ్లింగ్ లో సరికొత్తగా ట్రై చూసారుగా
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

