AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సార్‌ టాలెంట్‌ మామూలుగా లేదు.. స్మగ్లింగ్ లో సరికొత్తగా ట్రై చూసారుగా

సార్‌ టాలెంట్‌ మామూలుగా లేదు.. స్మగ్లింగ్ లో సరికొత్తగా ట్రై చూసారుగా

Phani CH
|

Updated on: Nov 20, 2025 | 6:36 PM

Share

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ.1.55 కోట్ల విలువైన బంగారాన్ని ఇస్త్రీ పెట్టెలో దాచి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. షార్జా నుండి వచ్చిన పొద్దుటూరు వ్యాపారి 1200 గ్రాముల 11 బంగారు బిస్కెట్లను చాకచక్యంగా దాచి తీసుకొచ్చాడు. ఎయిర్‌పోర్టు బయట తనిఖీ చేయగా అక్రమ రవాణా గుట్టు రట్టయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎయిర్‌ పోర్టులో ఓ వ్యక్తి ఎంతో డీసెంట్‌గా విమానం దిగి బయటకు వస్తున్నాడు. సెక్యూరిటీ అతని లగేజ్‌ను చెక్‌ చేసి పంపించారు. తీరా బయటకు వచ్చాక అధికారుల దృష్టి అతని లగేజ్‌ పైకి మళ్లింది. ఈసారి కాస్త శ్రద్ధగా తనిఖీ చేయడంతో అతని బండారం బయటపడింది. బట్టలు ఐరన్‌ చేసే ఇస్త్రీ పెట్టెలో ఏకంగా రూ.1.55 కోట్ల సరుకు దాచాడు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన జరిగింది. కడప జిల్లా పొద్దుటూర్‌కు చెందిన ఓ వ్యాపారి ఇటీవల షార్జా వెళ్లాడు. షార్జా నుంచి నవంబర్‌ 14న హైదరాబాద్‌ తిరుగు ప్రయాణమైన వ్యాపారి తనతోపాటు 1200 గ్రాముల బరువున్న 11 బంగారం బిస్కెట్లను తీసుకొచ్చాడు. వీటిని ఎంతో పకడ్భందీగా ఇస్త్రీ పెట్టెలో అమర్చి ఏ మాత్రం అనుమానం రాకుండా కవరింగ్ ఇచ్చాడు. ఇతడు ప్రయాణించిన విమానం శంషాబాద్‌లో ల్యాండ్ అయింది. ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారుల తనిఖీలను చాకచక్యంగా తప్పించుకున్నాడు. గ్రీన్‌ ఛానల్‌ నుంచి బయటకు వెళుతున్న సమయంలో అతని లగేజీపై ఎయిర్‌ పోర్టు అధికారుల కన్నుపడింది. వెంటనే లగేజీ చెక్‌ చేయగా అక్రమ బంగారం తరలిస్తున్న గుట్టురట్టయింది. డీఆర్‌ఐ అధికారులు అతడి బ్యాగేజీలో ఉన్న ఇస్ట్రీపెట్టె ను బయటకు తీశారు. దాన్ని విప్పి చూడగా మొత్తం 11 బంగారు బిస్కెట్లు కనిపించాయి. వాటి విలువ రూ.1.55 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేసారు. ఆ బంగారాన్ని ఫలానా వ్యక్తి కోసం తీసుకొచ్చానని ప్రయాణికుడు చెప్పగా, ప్రొద్దుటూరులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్‌ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అరే.. బాబు అవి పాములు రా.. పొట్లకాయలు కాదు.. మీకు వీడియో చూసే ధైర్యముందా

Priyanka Chopra: ప్రియాంక తెలుగు ఎంత క్యూట్‌గా ఉందో

Viral Video: రూటు మార్చిన దొంగలు.. ముసుగులు ధరించి

తిరుమల భక్తులకు అలర్ట్ వైకుంఠ ద్వార దర్శనాలపై అప్ డేట్

Chandrababu Naidu: చంద్రబాబు నిద్రను డిసైడ్ చేసేది ఈ ఆరా రింగే !! స్పెషల్ ఏమిటో తెలుసా ??