తిరుమల భక్తులకు అలర్ట్ వైకుంఠ ద్వార దర్శనాలపై అప్ డేట్
తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు 10 రోజుల పాటు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ, 164 గంటలు సర్వదర్శనం కేటాయించారు. గతంలో జరిగిన తొక్కిసలాట నివారణకు ఆఫ్ లైన్ టోకెన్లను రద్దు చేశారు. ఆన్‌లైన్ ఈ-డిప్ ద్వారా టోకెన్ల కేటాయింపు జరుగుతుంది. శ్రీవాణి, రూ.300 దర్శనాలు రద్దు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ ఏడాది సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించేలా దర్శన సమయాలను కేటాయించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను కొనసాగించాలని పాలకమండలి నిర్ణయించింది. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకు సర్వదర్శనం కల్పించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇది సీఎం ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామంది. గతంలో తిరుపతిలోని కౌంటర్లలో ఆఫ్ లైన్‌లో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను జారీ చేసే విధానాన్ని ఈసారి రద్దు చేశారు. గతేడాది తిరుపతిలోని కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనను దృష్టిలో ఉంచుకుని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా, పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. సామాన్య భక్తుల కోసం ఉద్దేశించిన సర్వదర్శనం టోకెన్ల కేటాయింపులో టీటీడీ కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. డిసెంబర్ 30, 31, జనవరి 1న దర్శనాలకు సంబంధించి మొదటి మూడు రోజులకు ఈ-డిప్ ద్వారా టికెట్లను కేటాయించనున్నారు. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డిసెంబర్ 2న ఆన్‌లైన్ డిప్ ద్వారా టోకెన్లను కేటాయిస్తారు. టోకెన్లను టీటీడీ వెబ్‌సైట్, యాప్, వాట్సాప్ ద్వారా మాత్రమే జారీ చేస్తారు. ఆఫ్ లైన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేశారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి 1న శ్రీవాణి ట్రస్ట్, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 10 రోజుల పాటు ప్రొటోకాల్ దర్శనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. మిగిలిన అన్ని బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chandrababu Naidu: చంద్రబాబు నిద్రను డిసైడ్ చేసేది ఈ ఆరా రింగే !! స్పెషల్ ఏమిటో తెలుసా ??
రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్ పరీక్షలు ఎప్పుడంటే
మాయదారి ఉల్లి,వెల్లుల్లి.. 11 ఏళ్ల కాపురాన్నే కూల్చేసాయిగా!
జూ కీపర్‌పై ఎలుగుబంటి దాడి.. పాపం చివరికి
ఆ దేశం లో టీనేజర్లకు సోషల్ మీడియాను బ్యాన్..
పేద యువతికి పెళ్ళి చేసిన పల్లె.. ఇది కదా మానవత్వం అంటే..
అద్దె ఇల్లు కావాలంటూ వచ్చారు.. దొరికింది దోచుకుపోయారు..
ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..
వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు

