అరే.. బాబు అవి పాములు రా.. పొట్లకాయలు కాదు.. మీకు వీడియో చూసే ధైర్యముందా
విశాఖ స్నేక్ క్యాచర్ నాగరాజు రెండు రోజుల్లో సింధియా, అగనంపూడి ప్రాంతాల్లో 6-8 అడుగుల పొడవున్న నాలుగు జెర్రి పాములను పట్టుకుని రక్షించారు. ఈ విషరహిత పాములను అడవిలో విడిచిపెట్టే ముందు, వాటిని చేతిలో పట్టుకున్న వీడియో వైరల్‌గా మారింది. మానవులను, వన్యప్రాణులను రక్షించడంలో స్నేక్ క్యాచర్ల పాత్రను ఈ ఘటన హైలైట్ చేస్తుంది.
పాము పేరు వింటేనే కొందరు భయంతో ఆమడ దూరం పరిగెడతారు. అదే పాము కళ్ళ ముందు కనిపిస్తే ఇంకేమైనా ఉందా?… గుండెలు జారిపోవాల్సిందే. కానీ భయం గొలిపే అలాంటి పాములను అలవోకగా పట్టేసి వాటి బారి నుంచి జనాలను రక్షిస్తుంటారు స్నేక్ క్యాచర్లు. అంతేకాదు వాటికి రక్షణ కల్పిస్తుంటారు. ఒక్క ఫోన్ కొడితే చాలు.. క్షణాల్లో వాలిపోయి పాములను పట్టుకుంటుంటారు. తర్వాత వాటిని జనాలకు దూరంగా సురక్షితంగా అటవీ ప్రాంతాల్లో వదిలేస్తారు. లేదా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలకు అప్పగిస్తారు. విశాఖ జిల్లాలోని ఓ స్నేక్ క్యాచర్ రెండు రోజుల్లో ఏకంగా నాలుగు పాములు పట్టుకున్నాడు. స్నేక్ క్యాచర్ నాగరాజు రెండు రోజుల వ్యవదిలో విశాఖ ప్రాంతంలో నాలుగు పాములను పట్టుకున్నారు. సింధియా, అగనంపూడి ప్రాంతాల్లో పాములను రెస్క్యు చేశారు. పట్టుబడిన పాముల్లో 6 నుంచి 8 అడుగుల పొడవున్న నాలుగు జెర్రి పాములు ఉన్నాయి. జెర్రి పాములను ర్యాట్ స్నేక్స్ అని కూడా అంటారు. విష రహిత పాము జాతికి చెందిన రాట్ స్నేక్స్‌ను పట్టుకొని.. వాటిని సురక్షితంగా అడవుల్లో వదిలిపెట్టారు నాగరాజు. అయితే అడవిలో వదిలే ముందు చేతి నుంచి వేలాడుతూ కట్టలుగా ఉన్న పాములను వీడియో తీశారు అతని టీం మేట్స్. నాలుగు పాములను ఒకేసారి చేతిలో పట్టుకొన్ని వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కట్టలుగా ఉన్న పాములను చూసి జనాలు షాకవుతున్నారు. ఒంట్లో వణుకు పుడుతోందని కొందరు కామెంట్స్ చేసారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Priyanka Chopra: ప్రియాంక తెలుగు ఎంత క్యూట్‌గా ఉందో
Viral Video: రూటు మార్చిన దొంగలు.. ముసుగులు ధరించి
తిరుమల భక్తులకు అలర్ట్ వైకుంఠ ద్వార దర్శనాలపై అప్ డేట్
Chandrababu Naidu: చంద్రబాబు నిద్రను డిసైడ్ చేసేది ఈ ఆరా రింగే !! స్పెషల్ ఏమిటో తెలుసా ??
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

