AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిట్టీలు కట్టించుకుని మోసం చేసిన మహిళ.. బాధితులు ఏం చేశారంటే

చిట్టీలు కట్టించుకుని మోసం చేసిన మహిళ.. బాధితులు ఏం చేశారంటే

Phani CH
|

Updated on: Nov 20, 2025 | 8:03 PM

Share

అనంతపురం జిల్లా గుంతకల్లులో చిట్టీల మోసం వెలుగుచూసింది. దిల్షా బేగం అనే మహిళ లక్షల రూపాయలు వసూలు చేసి ఎగ్గొట్టింది. డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన బాధితులు ఆమెకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి హెచ్చరించింది.

చిట్టీల పేరుతో పేదవారిని మోసం చేస్తున్న అనేక ఘటనలను చూసుంటారు. రోజూ ఎక్కడో అక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయినా చిట్టీలు వేసేవారు వేస్తూనే ఉన్నారు..మోసం చేసేవారు చేస్తూనే ఉన్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో ఓ మహిళ చిట్టీలు కట్టించుకొని డబ్బులు ఎగ్గొట్టడంతో ఆమెకు బాధితులు దేహశుద్ధి చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో దిల్షా బేగం అనే మహిళ.. ఫోటో స్టూడియో నడుపుతూ జీవనం సాగిస్తోంది. దీంతోపాటు సైడ్‌ బిజినెస్‌గా చిట్టీల వ్యాపారం కూడా చేస్తోంది. ఈ క్రమంలో స్టూడియోకు వచ్చే కస్టమర్స్‌ని మచ్చిక చేసుకొని వారితో చిట్టీలు కట్టించింది. దిల్షాబేగం మాటలు నమ్మి చాలామంది ఆమెవద్ద చిట్టీలు కట్టారు. లక్షల్లో సొమ్ము వసూలు చేసిన బేగం.. చిట్టీలు పాడుకున్నవారికి డబ్బులు ఇవ్వకుండా రేపుమాపు అంటూ వాయిదాలు వేసుకుంటూ వస్తోంది. దీంతో ఆగ్రహం చెందిన బాధితులు దిల్షాబేగం స్టూడియో వద్దకు వచ్చి తమ డబ్బులు తమకు ఇవ్వాలని నిలదీశారు. దీంతో ఆమె తమను బెదిరిస్తోందని బాధితులు ఆరోపించారు. ఆమె అలా చేయడంతో ఆగ్రహించిన బాధితులు.. ఆ మహిళను పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. చిట్టీలు కట్టిన వారిలో హిజ్రాలు కూడా ఉన్నారు. అవసరానికి అక్కరకొస్తాయని రూపాయి రూపాయి పోగేసి చిట్టీలు కట్టామని, డబ్బులు ఇవ్వకపోగా తమపై బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్నారి చేసిన పనికి చలించిపోయిన దొంగ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే ??

ఉచితగా AI కోర్స్ ఈ విధంగా నేర్చుకోండి.. జీవితంలో సెటిల్ అవ్వండి

సార్‌ టాలెంట్‌ మామూలుగా లేదు.. స్మగ్లింగ్ లో సరికొత్తగా ట్రై చూసారుగా

అరే.. బాబు అవి పాములు రా.. పొట్లకాయలు కాదు.. మీకు వీడియో చూసే ధైర్యముందా

Published on: Nov 20, 2025 07:55 PM