రైల్వే టికెట్ బుకింగ్ విధానంలో మార్పులు
రైలు ప్రయాణం చేయబోతున్నారా? మీతో ప్రయాణించే వారిలో వృద్ధులు కూడా ఉన్నారా? వారికి పై బెర్త్ కేటాయిస్తే ఎలా అని వర్రీ అవుతున్నారా. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు భారత రైల్వే టికెట్ బుకింగ్ విధానంలో కొన్ని మార్పులను చేసింది. సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు పైబడిన మహిళలు, గర్భిణులకు టికెట్ బుక్ చేసే సమయంలోనే ఆటోమేటిక్‌గా లోయర్ బెర్త్‌ను కేటాయించే విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఆ సమయంలో లోయర్ బెర్త్‌లు అందుబాటులో ఉంటేనే వారికి దానిని కేటాయిస్తారు. అయితే సిబ్బంది తరువాత ఆయా సీట్ల లభ్యతను బట్టి వాటిని వారికి కేటాయించ వచ్చు. అలాగే లోయర్ బెర్త్ లభ్యమైతేనే బుక్ చేయమనే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. రిజర్వ్ కోచ్‌లలో నిద్ర వేళలు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు నిర్ణయించారు. స్టేషన్లలో లైసెన్స్‌డ్ పోర్టర్లు కూడా మీకు సహాయం చేస్తారు. కొన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో బ్యాటరీ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి సహాయంతో వృద్ధులు, గర్భిణులు తాము ఎక్కే బోగీ వరకూ చేరుకోవచ్చు. వృద్ధులు, వైకల్యం ఉన్న వారికి ఇబ్బందులు లేకుండా స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్లు ఉన్నాయి. ప్రయాణ సమయంలో ఏదైనా కారణాలవల్ల కొన్నిసార్లు ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుంది. సీటు విరిగిపోవడం, కోచ్‌లో ఇచ్చిన దుప్పట్లు సరిగా లేకపోవడం, కోచ్‌లు అపరిశుభ్రంగా ఉండటం, ఏసీ పని చేయకపోవడం, ఫోన్ ఛార్జింగ్ స్లాట్ పని చేయకపోవడం, ఆహారం బాగోలేకపోవడం వంటివి. వెంటనే రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్ 139 లేదా ‘రైల్ మదద్’ యాప్ ద్వారా కంప్లైంట్ చేసే హక్కు ప్రయాణికుడికి ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్లడ్ ఇవ్వండి.. ఓ కప్పు టీ తాగండి
వృద్ధ దంపతుల సాహసం.. ఐదేళ్లు శ్రమించి
గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్రం హెచ్చరిక
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

