బ్లడ్ ఇవ్వండి.. ఓ కప్పు టీ తాగండి
రక్తదానం చేసిన వారికి ఎవరైనా పండ్లు ఇస్తారు..వాళ్లు తిరిగి త్వరగా పుంజుకుంటారు అని. అంతేకానీ వీళ్లేంటి టీ ఫ్రీగా ఇస్తున్నారు? అనుకుంటున్నారా? ఓ మంచి పని చేయడానికి తన శక్తికొద్దీ ప్రయత్నం చేశాడు ఓ టీ స్టాల్ నిర్వాహకుడు. రక్తదానాన్ని ప్రోత్సహించడమే తన ఉద్దేశమంటూ రక్తదానం చేయండి.. ఫ్రీగా టీ తాగండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఈ పోస్టులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యాడ్ లో పోలీసులు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయటానికి పలు ప్రచార మాధ్యమాలు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. నేలకొండపల్లిలోని తారా కేఫ్ నిర్వాహకుడు రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడానికి తన వంతు బాధ్యతగా రక్తదానం చేసిన వారికి ఫ్రీగా టీ అందిస్తానని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు అక్టోబరు 31న జరిగిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన దాతలకు ఎంతో అభిమానంతో చక్కని ఇరానీ ఛాయ్‌ని ఫ్రీగా అందించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతని సామాజిక బాధ్యతను చూసి పలువురు ప్రశంసించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వృద్ధ దంపతుల సాహసం.. ఐదేళ్లు శ్రమించి
గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్రం హెచ్చరిక
రక్షణ రంగం ఉత్పత్తులకు కేరాఫ్ గా హైదరాబాద్
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

