ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి.. తల్లినే చంపింది
బెంగళూరులోని ఉత్తరహళ్లిలో నేత్రావతి అనే మహిళకి 15 ఏళ్ల కుమార్తె ఉంది. ఓ లోన్ రికవరీ సంస్థలో టెలీ కాలర్‌గా పని చేస్తోంది. కుమార్తె 9వ తరగతికే చదువు మానేసింది. ప్రస్తుతం ఇంట్లోనే ఖాళీగా ఉంటోంది. ఆ కుమార్తెకు 17 ఏళ్ల బాలుడు పరిచయం అయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో అతడు నేత్రావతి ఇంట్లో లేనప్పుడల్లా కుమార్తె వద్దకు వచ్చి ఆమెతో గడిపేవాడు.
అంతేకాకుండా వెంట తన స్నేహితులను కూడా తీసుకువచ్చి పొద్దంతా ఇంట్లోనే ఉండేవాడు. ఇంట్లో ఖాళీగా ఉండే బాలికకు.. స్నేహితులు, ప్రియుడు ఇంటికి రావడం చాలా సంతోషాన్ని ఇవ్వడంతో ఎక్కువగా వారితోనే సమయం గడిపేది. అయితే ఓసారి నేత్రావతి ఈ విషయాన్ని గుర్తించింది. ఇక మీదట వారిని ఇంటికి రానివ్వకూడదని బెదిరించింది. తల్లి హెచ్చరించడం తనను వేరే ఊరికి తీసుకెళ్లిపోతుందని మరింత కోపం పెంచుకున్న బాలిక.. అక్టోబర్ 24న తన స్నేహితులతో కలిసి మాల్‌లో భేటీ అయింది. అక్కడే తన ప్రేమకు, స్నేహితులను కలవడానికి అడ్డుగా ఉన్న తల్లిని చంపేందుకు పథకం వేసింది. ప్లాన్ ప్రకారం.. అక్టోబర్ 25వ తేదీ రాత్రి సుమారు 11 గంటలకు ఆ నలుగురు నేత్రావతి ఇంటికి చేరుకున్నారు. బాలిక తన వద్ద ఉన్న నకిలీ తాళం చెవితో తలుపు తెరిచింది. ఆపై తన గదిలోకి వారిని తీసుకెళ్లింది. కావాలనే గట్టిగట్టిగా నవ్వుతూ వాళ్లంతా రచ్చ చేశారు. అదంతా విన్న నేత్రావతి కుమార్తె గదికి వెళ్లింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని ఆ యువకులకు చెప్పింది. లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. నేత్రావతిని ఆమె కుమార్తె, ఆ యువకులు కలిసి.. గొంతును తువ్వాలుతో బిగించి చంపేశారు. అనంతరం ఆ హత్యను ఆత్మహత్యగా నమ్మించేందుకు మృతదేహాన్ని చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడదీశారు. ఆ తర్వాత బాలిక.. తన ఇంటికి తాళం వేసి వారితో పాటే పారిపోయింది. అదే రోజు బాలిక తన అమ్మమ్మ ఇంటికి చేరుకుంది. అనుమానాస్పదంగా ప్రవర్తించింది. నేత్రావతి కుటుంబ సభ్యులు గట్టిగా అడగ్గా.. తాను తన స్నేహితులతో కలిసే తల్లిని చంపినట్లు అంగీకరించింది. ఇలా బాలిక సహా నేరానికి పాల్పడ్డ ముగ్గురు బాలురను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే 13 ఏళ్ల బాలుడు మాత్రం ఇంకా తప్పించుకుని తిరుగుతున్నాడని.. అతడిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నేత్రావతిని చంపడానికి వీరు ముందుగానే ప్లాన్ చేసుకున్నారా? లేదా గొడవ జరగడంతో హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డిన్నర్ డేట్‌కి ముగ్గురు బిలియనీర్లు .. ఫొటోలు వైరల్
రైల్వే టికెట్ బుకింగ్ విధానంలో మార్పులు
బ్లడ్ ఇవ్వండి.. ఓ కప్పు టీ తాగండి
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

