Gold Price Down: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ మళ్లీ తగ్గిన బంగారం ధరలు
ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. ధరలు భారీగా పతనమయ్యాయి. ఇటీవలే రూ.1.30 లక్షలు దాటిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఒక్కరోజులో 9వేలు పడిపోవడంతో.. బులియన్ మార్కెట్లో కాస్తంత రిలీఫ్ కనిపిస్తోంది. ఈనెల 16న 24 క్యారెట్ల తులం బంగారం లక్షా 36వేల ధర పలికింది.
ఇక లక్షన్నరే టార్గెట్‌గా పసిడి పరుగులు తీస్తుందని అంతా భావించారు కానీ.. జరిగింది వేరు. బంగారం రూటు మార్చి దిగొస్తోంది. అమెరికా లెక్కల ప్రకారం ఔన్సు బంగారం 4360 డాలర్లను తాకింది. రెండ్రోజులు అక్కడే చక్కర్లు కొట్టి.. ఒక్కసారిగా టప్.. మని పడిపోయింది. రెండు రోజుల్లో 300 డాలర్లు దిగింది. దీంతో పసిడి ధరలు కొంత మేర తగ్గాయి. ఆ క్రమంలో ఈ రోజు అంటే.. శుక్రవారం బంగారం ధర స్వల్పంగా దిగి వచ్చాయి.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,25,070గా ఉంది. ఇదే 10 గ్రాముల బంగారం ధర నిన్న అంటే గురువారం రూ 1,25,080గా ఉంది. అంటే రూ.10 మేర ధర తగ్గింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,640గా ఉంది. ఈ బంగారం ధర నిన్న అంటే గురువారం రూ.1,14,650గా ఉంది. మరికొన్ని రోజుల్లో బంగారం ధరలు ఇంకా పడిపోయే అవకాశాలున్నాయి. దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ పేల్చిన బాంబుతో బంగారం పడిపోతోంది. చైనాతో ఇన్నిరోజులు కయ్యం పెట్టుకున్న ట్రంప్.. ఇప్పుడు ఆ దేశంపై సుంకాలు ఎక్కువ రోజులు కొనసాగవని సంకేతాలు ఇవ్వడంతో బంగారం తగ్గుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు.. కొన్ని రోజులుగా పెరుగుతూపోయిన బంగారం మార్కెట్లో.. ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదికూడా ఒక కారణమే. గతేడాది ట్రంప్ గెలిచిన దగ్గర్నుంచి పెరుగుతూపోయిన బంగారం ధర.. ఇప్పుడు తగ్గడానికి ముఖ్యమైన కారణమేంటంటే.. అనేక దేశాల్లో యుద్ధ వాతావరణ పరిస్థితులు తొలగిపోయి.. సాధారణ పరిస్థితులు నెలకొనడం కూడా ఇంకో కారణం. భారత్‌లో అయితే.. ధన్ తేరస్ కు ముందు బంగారం ధరలు పెరిగి, ఆ తర్వాత పడిపోవడం సర్వసాధారణం. కనుక ధరలు తగ్గటానికి.. ఇదీ ఓ కారణమే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. తక్కువ టైంలో ఎక్కువగా పెరుగుతూ పోవడం వల్ల మార్కెట్లో కరెక్షన్ రావడమూ సహజమే. ఇప్పుడు జరుగుతోంది కూడా అదే అంటున్నారు. ట్రంప్ ఇప్పటికే చైనా సుంకాలను తగ్గించే యోచనలో ఉండగా, అదే బాటలో భారత్ మీదా సుంకాలు తగ్గిస్తారనే అంచనాలున్నాయి. అదే జరిగితే.. బంగారంతోపాటు.. వెండి, ఇతర కమోడిటీల ధరలు దిగిరానున్నాయి. అదే జరిగితే.. బంగారం మరోసారి లక్ష దిగువకు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమాపై కన్ఫ్యూజన్
టాక్సిక్ విషయంలో తప్పెక్కడజరుగుతోంది ??
ఉత్త పోస్టర్ మాత్రమే అనుకునేరు.. ఆ పోస్టర్‌తోనే కథపై హింట్ ఇచ్చిన డైరెక్టర్
‘నేను విడాకులు తీసుకుంటే వాళ్లు సంబరాలు చేసుకున్నారు’
‘అరడజను’ పిల్లలతో సంతోషంగా ఉండు బావా !! డార్లింగ్‌కు మోహన్‌బాబు బర్త్‌డే విష్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

