దేశం నిండా బంగారమే.. ఎంత కావాలంటే అంత కొనుక్కోవచ్చు

ఒక పక్క కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు.. మరో పక్క పండుగలు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారం దిగుమతులు గణనీయంగా పెరిగాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే ఆగస్టులో రికార్డు స్థాయిలో బంగారం దిగుమతులు జరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఆగస్టు నెలలో బంగారం దిగుమతుల విలువ 4.93 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఈ ఏడాది ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో 10.06 బిలియన్ డాలర్లకు చేరడం విశేషం.

దేశం నిండా బంగారమే.. ఎంత కావాలంటే అంత కొనుక్కోవచ్చు

|

Updated on: Sep 23, 2024 | 9:29 PM

ఒక పక్క కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు.. మరో పక్క పండుగలు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారం దిగుమతులు గణనీయంగా పెరిగాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే ఆగస్టులో రికార్డు స్థాయిలో బంగారం దిగుమతులు జరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఆగస్టు నెలలో బంగారం దిగుమతుల విలువ 4.93 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఈ ఏడాది ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో 10.06 బిలియన్ డాలర్లకు చేరడం విశేషం. గణనీయంగా బంగారం దిగుమతులు జరగడంపై వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ స్పందించారు. బంగారం స్మగ్లింగ్, ఇతర కార్యకలాపాలను అరికట్టేందుకు కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గించినట్లు ఆయన తెలిపారు. నగల వ్యాపారులు పండుగ సీజన్‌ నేపథ్యంలో అమ్మకాల కోసం బంగారాన్ని నిల్వ చేయడం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. 2024 – 25 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రభుత్వం బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుండి 6 శాతానికి తగ్గించింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నీలి రంగులో గోదారి.. ఎర్రగా ప్రాణహిత.. ఇంతకీ ఏం జరుగుతోంది ??

మెటా ఇన్‌స్టాలో కొత్త ఫీచర్‌.. పేరెంట్స్‌ కంట్రోలింగ్‌లోనే టీనేజర్ల ఖాతాలు

ఓర్నీ… అదుర్స్‌ సినిమా చూపించి ఆపరేషన్‌ చేసేసారు… రోగి మాత్రం..

ఇలా చేస్తే ముఖం మీద మచ్చలే ఉండవు

ఇవి తినండి చాలు.. మీ బ్రెయిన్ కంప్యూటర్‌లా పనిచేస్తుంది !!

Follow us