నీలి రంగులో గోదారి.. ఎర్రగా ప్రాణహిత.. ఇంతకీ ఏం జరుగుతోంది ??

నీలి రంగులో గోదారి.. ఎర్రగా ప్రాణహిత.. ఇంతకీ ఏం జరుగుతోంది ??

Phani CH

|

Updated on: Sep 23, 2024 | 9:23 PM

త్రివేణి సంగమం వద్ద విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. కాలేశ్వరం పుష్కరఘాట్ త్రివేణి సంగమం వద్ద గోదావరి నీరు రెండు వర్ణాలతో ప్రవహిస్తూ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎగువ నుండి వచ్చే గోదావరి-ప్రాణహిత కలయిక వద్ద గోదావరి రెండు రంగులలో ప్రవహించడం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఆ విచిత్ర సన్నివేశాన్ని సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ మురిసిపోయారు.

త్రివేణి సంగమం వద్ద విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. కాలేశ్వరం పుష్కరఘాట్ త్రివేణి సంగమం వద్ద గోదావరి నీరు రెండు వర్ణాలతో ప్రవహిస్తూ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎగువ నుండి వచ్చే గోదావరి-ప్రాణహిత కలయిక వద్ద గోదావరి రెండు రంగులలో ప్రవహించడం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఆ విచిత్ర సన్నివేశాన్ని సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ మురిసిపోయారు. గోదావరి, ప్రాణహిత రెండు మహారాష్ట్రలోనే ఆవిర్భవించాయి. దిగువన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. కాలేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత అంతర్వాహిని కలయికనే త్రివేణి సంగమంగా పిలుస్తారు. ఈ పవిత్ర స్థలంలో గోదావరిలో నీరు నీలిరంగులో… ప్రాణహితలో నీరు ఎరుపు రంగులో ప్రవహించడం.. ఒకదానికొకకటి కలవకుండా రెండు వర్ణాల నీరు సమాంతరంగా ప్రవహిస్తూ చూపరులను కనువిందు చేసాయి. రెండు వర్ణాలతో ప్రవహిస్తున్న గంగమ్మను చూసి భక్తులు ఆశ్చర్యపోయారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెటా ఇన్‌స్టాలో కొత్త ఫీచర్‌.. పేరెంట్స్‌ కంట్రోలింగ్‌లోనే టీనేజర్ల ఖాతాలు

ఓర్నీ… అదుర్స్‌ సినిమా చూపించి ఆపరేషన్‌ చేసేసారు… రోగి మాత్రం..

ఇలా చేస్తే ముఖం మీద మచ్చలే ఉండవు

ఇవి తినండి చాలు.. మీ బ్రెయిన్ కంప్యూటర్‌లా పనిచేస్తుంది !!