Gold Price Down: లక్ష దిగువకు బంగారం.. ఇదీ అసలు కారణం
కొన్ని నెలలుగా రన్నింగ్ రేస్‌లా దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. సామాన్యులు బంగారంవైపు చూడ్డానికి కూడా సాహసించనంతగా పెరిగిపోయిన బంగారం ధర.. ఇప్పుడు దిగి వస్తోంది. రెండ్రోజుల్లో ఔన్సు బంగారం ధర 300 డాలర్లు తగ్గింది. ఈ వ్యవధిలో భారత్‌లో పది గ్రాముల బంగారం ధర 9వేలు పడిపోవడంతో.. పసిడి కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఈ ధర ఇంకా తగ్గే అవకాశాలున్నట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇన్నాళ్లూ ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోయిన గోల్డ్ రేట్లు.. కంప్లీట్ యూటర్న్ తీసుకున్నాయి. ఒక్కరోజులో 9వేలు పడిపోవడంతో.. బులియన్ మార్కెట్లో కాస్తంత రిలీఫ్ కనిపిస్తోంది. అక్టోబరు 16న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం లక్షా 36వేలు ధర పలికింది. ఇక లక్షన్నరే టార్గెట్‌గా పసిడి పరుగులు తీస్తుందని అంతా భావించారు, కానీ అలా జరగలేదు. బంగారం రూటు మార్చి నెమ్మదిగా దిగొస్తోంది. అమెరికా లెక్కల ప్రకారం ఔన్సు బంగారం 4360 డాలర్లను తాకింది. రెండ్రోజులు అక్కడే చక్కర్లు కొట్టి.. ఒక్కసారిగా టప్ మని 300 డాలర్లకు పడిపోయింది. ఇది ఇంకా తగ్గుతుందన్న టాక్ నడుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో బంగారం ధర రూ. 1, 28,600కి చేరింది. ఇక కిలో వెండి ధర.. రూ. 1,62,000 చేరింది. వెండి ఒకానొక దశలో రూ. 1,88,000 చేరుకుని.. ఇప్పుడు పాతిక వేలు దిగివచ్చింది. చైనాతో ఇన్నిరోజులు కయ్యం పెట్టుకున్న ట్రంప్.. ఇప్పుడు ఆ దేశంపై సుంకాలు ఎక్కువ రోజులు కొనసాగవని సంకేతాలు ఇవ్వడంతో బంగారం ధర తగ్గుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు.. కొన్ని రోజులుగా పెరుగుతూపోయిన బంగారం మార్కెట్లో.. ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదికూడా ఒక కారణమే. అనేక దేశాల్లో యుద్ధవాతావరణ పరిస్థితులు తొలగిపోయి.. సాధారణ పరిస్థితులు నెలకొనడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. భారత్‌లో అయితే.. దంతేరాస్‌కు ముందు బంగారం ధరలు పెరిగి, తర్వాత పడిపోవడం కూడా సర్వసాధారణం అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. తక్కువ సమయంలో ఎక్కువగా పెరుగుతూ పోవడం వల్ల మార్కెట్లో కరెక్షన్ రావడం కూడా సహజమే అని వారు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దీపావళి బోనస్ ఇవ్వలేదని టోల్ గేట్లు ఎత్తేసారు !! రూ. లక్షల్లో నష్టం
అరటి గెలల కోసం పోటీ.. ఏమిటి వాటికి అంత ప్రత్యేకత
బొద్దింకను చంపబోయి.. అపార్ట్‌మెంట్‌కే నిప్పటించింది
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

