దీపావళి బోనస్ ఇవ్వలేదని టోల్ గేట్లు ఎత్తేసారు !! రూ. లక్షల్లో నష్టం
ఉత్తరప్రదేశ్ లోని ఫతేహాబాద్ టోల్ గేట్ దగ్గర సిబ్బంది డ్యూటీ మానేశారు. కాంట్రాక్టు సంస్థ తమకు దీపావళి బోనస్ ఇవ్వలేదని ఆరోపిస్తూ టోల్ గేట్లను ఎత్తేశారు. వాహనాల నుంచి టోల్ వసూలు చేయకుండానే వాటిని వదిలివేశారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి లక్షల రూపాయల నష్టం వచ్చింది. ఆగ్రా– లక్నో ఎక్స్ ప్రెస్ వే పై నిత్యం లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
ఫతేహాబాద్ టోల్ గేట్ పై టోల్ వసూలు చేసే కాంట్రాక్ట్‌ను శ్రీసాయి అండ్ దాతర్ కంపెనీ సొంతం చేసుకుంది. సిబ్బందిని నియమించుకుని టోల్ వసూలు చేస్తోంది. దీపావళి సందర్భంగా బోనస్ ఇస్తామని కంపెనీ నిర్వాహకులు హామీ ఇచ్చారని టోల్ గేట్ సిబ్బంది అన్నారు. వారం క్రితమే బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని చెప్పిన యాజమాన్యం ఆ హామీని నిలబెట్టుకోలేదని వారు ఆరోపించారు. దీంతో తాజాగా టోల్ గేట్ సిబ్బంది ధర్నా చేసారు. తమ కంపెనీ తీరుకు నిరసనగా టోల్ వసూలు నిలిపివేసి వాహనాలను వదిలివేశారు. దీంతో దాదాపు పది గంటల పాటు వేలాది వాహనాలు టోల్ కట్టకుండానే వెళ్లిపోయాయి. విషయం తెలిసి వేరే ప్రాంతాల నుంచి సిబ్బందిని పంపించి టోల్ వసూలు చేసేందుకు దాతర్ కంపెనీ యాజమాన్యం ప్రయత్నించగా.. స్థానిక సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో వారితో చర్చలు జరిపిన దాతర్ కంపెనీ యాజమాన్యం.. సిబ్బంది అందరికీ పది శాతం వేతనం పెంచేందుకు అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. ఉద్యోగులంతా విధుల్లోకి చేరి టోల్ వసూలు చేయడం ప్రారంభించారు. ఈ గొడవతో కేంద్ర ప్రభుత్వానికి లక్షల్లో నష్టం వచ్చినట్లు సమాచారం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరటి గెలల కోసం పోటీ.. ఏమిటి వాటికి అంత ప్రత్యేకత
బొద్దింకను చంపబోయి.. అపార్ట్‌మెంట్‌కే నిప్పటించింది
సముద్ర తీరంలో భారీ కళేబరం.. దగ్గరికెళ్లి చూస్తే
డ్రగ్ టెస్ట్‌లో నటి హేమకు ‘నెగెటివ్
వృద్ధురాలికి వానరం.. కన్నీటి వీడ్కోలు
నిప్పుల కొలిమిలా ఏపీ...54 మండలాల్లో తీవ్ర వడగాలుల ముప్పు!
50 రోజులు జైల్లో 25 హోటల్లో.. 19 గంటలు బస్సులో..
పాకిస్థాన్‌లో పెట్రో మంటలు.. లీటరు ఎంతో తెలుసా?
కిరాణా వ్యాపారి ఖతర్నాక్ స్కెచ్..పేదల బంగారం స్వాహా
ఓర్నీ.. విమానంలో ఉన్నప్పుడు.. నీకిదేం పోయేకాలం రా

