రాబోయేది మినరల్ వార్.. రంగంలోకి భారత్.. చైనాకు చెక్
ప్రపంచ వ్యాప్తంగా దేశాల మధ్య గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఎయిర్‌స్ట్రైక్స్, మరో వైపు ట్రేడ్ వార్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన చర్చ తెరమీదకు వచ్చింది. అదే అరుదైన లోహాలు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు దేశాల మీద ట్రేడ్ వార్ మొదలు పెట్టిన నేపథ్యంలో చైనా కూడా అదే రీతిలో స్పందించింది.
ఈ భూమి మీద ఎక్కడా దొరకని అరుదైన లోహాలను అమెరికాకు ఎగుమతి చేసేందుకు చైనా నిరాకరించింది. దీంతో అగ్రరాజ్యం చైనాపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ క్రమంలో ఖనిజాల ప్రాధాన్యతపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. మారుతున్న శాస్త్ర సాంకేతిక రంగంలో భూమిలో లభించే అరుదైన ఖనిజాల లభ్యతపై అగ్రదేశాలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఏకంగా వాటిని 21వ శతాబ్దపు “కొత్త చమురు” అని పిలుస్తున్నారంటేనే వాటి ప్రాముఖ్యత ఏపాటిదో అర్థమవుతోంది. అరుదైన భూమి మూలకాలు అని పిలిచే 17 అరుదైన లోహాల సమూహం. స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్‌మిల్లులు, రక్షణ వ్యవస్థలతో సహా మన రోజువారీ గాడ్జెట్‌లు, యంత్రాల తయారీలో ఈ లోహాలు కీలకమయ్యాయి. ఈ లోహాలు స్వచ్ఛమైన శక్తి, బలమైన ఆర్థిక వ్యవస్థ, స్థిరమైన భవిష్యత్తు వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచం ఇప్పుడు ఈ లోహాల ప్రాముఖ్యతను గుర్తించిన నేపథ్యంలో, భారతదేశం కూడా వీటి గురించిన అవగాహనను కలిగి ఉండటం వంటి విషయాలలో వెనుకబడి ఉండకూడదని నిశ్చయించుకుంది. ఇటీవల ఇండియా వీటిని తదుపరి సూపర్ పవర్‌గా మార్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రపంచంలోని అరుదైన ఖనిజాలలో దాదాపు 70% చైనా తవ్వకాలు జరుపుతోంది. ప్రపంచంలోని అరుదైన ఖనిజాలలో 90% చైనా శుద్ధి చేస్తుంది. అంటే ఏ దేశంలో గని ఉన్నా, ఈ ఖనిజాలను ఉపయోగించుకునేలా చేయడానికి అవి చైనాపై ఆధారపడతాయి. ప్రస్తుతం భారత్ రంగంలోకి దిగడంతో భవిష్యత్తులో ఈ పరిస్థితి మారబోతోంది.కేరళ, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో ఈ ఖనిజాల నిల్వలు ఉన్నాయి. ఇది భవిష్యత్ అవకాశాలను మరింత మెరుగు పరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్, ఎలక్ట్రిక్ వాహనాలు, దేశ సరిహద్దులను రక్షించే అధునాతన ఆయుధాలు అన్నీ వాటిపై ఆధారపడి ఉంటాయి. ఈ లోహాల సరఫరాను నియంత్రించే సామర్థ్యం ఉన్న దేశాలు 21వ శతాబ్దం సాంకేతిక రేసులో ముందంజలో ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా వంటి ప్రధాన దేశాలు ఖనిజాల శుద్ధిలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుని ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాయి. ఇది భారతదేశానికి ఒక సువర్ణావకాశాన్ని అందిస్తుందనేది విశ్లేషకుల అభిప్రాయం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గత అమావాస్యకు క్షుద్రపూజలు.. ఈ అమావాస్యకు షాపు దగ్ధం
అదరహో.. విమానాన్ని తలదన్నేలా వందే భారత్ స్లీపర్ ట్రైన్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

