రిషికేష్‌లో బామ్మ సాహసం.. ఆమె ఏం చేసిందంటే
వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని నిరూపిస్తూ 83 ఏళ్ల వృద్ధురాలు చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎలాంటి భయం లేకుండా, ఎంతో ఉత్సాహంగా ఆమె ఇండియాలోనే అత్యంత ఎత్తైన బంగీ జంప్ చేయడం అందరిలో స్ఫూర్తిని నింపుతోంది. ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
83 ఏళ్ల యూకే మహిళ రిషికేష్‌లోని భారతదేశపు అత్యంత ఎత్తైన బంగీ జంప్ చేయడానికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు. ఈ సాహసానికి సంబంధించిన వీడియోను ‘హిమాలయన్ బంగీ’ అనే సంస్థ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. బంగీ జంప్ థ్రిల్ కోసం 83 ఏళ్ల మహిళ యూకే నుంచి వచ్చారనీ రాసుకొచ్చారు. వీడియోలో వృద్ధురాలు జంప్ చేయడానికి ముందు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ప్లాట్‌ఫామ్ పై నుంచి దూకే సమయంలో ఆమెలో ఏమాత్రం భయం కనపడలేదు. పక్షిలా గాల్లో తేలుతూ, స్వేచ్ఛగా చేతులు కదిలిస్తూ ఆమె ఈ సాహసాన్ని పూర్తి చేశారు. వీడియో చూసిన నెటిజన్లు ఆమె ధైర్యాన్ని, సానుకూల దృక్పథాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించడానికి ఆమె ఒక గొప్ప ఉదాహరణ అని కామెంట్లు చేస్తున్నారు. “ఆమె కెమెరా వైపు కూడా చూడకుండా తన లోకంలో తాను ఆనందిస్తున్నారు. మనం కూడా జీవితంలో ఇలాగే ఉండాలి,” అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. “ఆమె ఎంత అద్భుతంగా గాల్లో ఎగురుతున్నారో చూడండి. ఒక నర్తకిలా తన చేతులను కదిలిస్తున్నారు” అని మరో యూజర్ కామెంట్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో కొన్ని వేల మంది హృదయాలను గెలుచుకుంటూ, సాహసాలు చేయడానికి వయసు అడ్డంకి కాదని నిరూపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దొంగల్లో ఖతర్నాక్ దొంగ.. హుండీని ఎలా కొల్లగొట్టాడు చూడండి
మీరు లాప్‌టాప్‌తో విమానాశ్రయానికి వెళుతున్నారా ?? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి
‘పని మనిషి చేతిలో మోసపోయా..’ ప్రసాద్ ఎమోషనల్
హాట్ సీన్లతో బ్యాన్ అయిన మూవీ.. OTTలో మాత్రం సూపర్ హిట్
అమ్మాయిలతో న్యూడ్ వీడియోకాల్…! తాను అలాంటి వాడిని కాదంటూ నటుడు ఎమోషనల్
వీధి కుక్కల్ని ఇంటికి తెచ్చిన భార్య .. విడాకులు కోరిన భర్త వీడియో
ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా?ఫోన్ పేలుద్ది జాగ్రత్త వీడియో
అర్ధరాత్రి కారు బీభత్సం..దగ్గరకు వెళ్లి చూడగా వీడియో
సారూ.. కాస్త ‘వైఫ్’ని వెతికి పెట్టరూ..? వీడియో
రూ.1.5 కోట్ల ఫ్లాట్.. పెన్సిల్తో గోడకు రంధ్రం ? వీడియో
ఆకాశం అంచులు తాకిన మోనో రైలు వీడియో
నడిరోడ్డుమీద భార్యను నరికి చంపాడు..కారణం ఇదే వీడియో

