అరటి గెలల కోసం పోటీ.. ఏమిటి వాటికి అంత ప్రత్యేకత
పండుగలు అంటే చుట్టాలు, బంధువులు స్నేహితులతో కలిసి చేసుకునే వేడుక. గ్రామాల్లో పండుగలు అంటే వాతావరణం కళకళలాడుతూ ఉంటుంది. ఇంటిముందు అందమైన రంగవల్లులు, గుమ్మాలకు పచ్చని తోరణాలతో గ్రామమంతా సందడి నెలకొంటుంది. ఇక దీపావళి అంటే టపాసులతో మోత మోగాల్సిందే. దీంతోపాటు ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారాన్ని పాటిస్తారు.
ఏలూరు జిల్లా పెరవలి మండలం ఖండవల్లి గ్రామస్తులు దీపావళిని ప్రత్యేకంగా జరుపుతారు. గ్రామ జనాభా 5 వేల మంది వరకు ఉంటారు. దీపావళి పండుగ సందర్భంగా ఊరులోని రైతులంతా కలిసి తమ తోటల్లోని అరటి చెట్లను తీసుకొచ్చి వీధుల్లో నాటుతారు. దాంతో గ్రామమంతా అరటితోటను తలపిస్తుంది. ఈ గ్రామంలో సంఘాలవారీగా 18 రామాలయాలు ఉన్నాయి. రైతులు తాము పండించిన అరటి గెలలను చెట్లతో సహా తీసుకొచ్చి రామాలయాలను సుందరంగా అలంకరించటం ఇక్కడి ప్రత్యేకత. దీపావళివేళ ఈ చెట్లపై మట్టిప్రమిదలను ఉంచి దీపాలు వెలిగిస్తారు. గ్రామంలోని 18 రామాలయాల వద్ద ఉంచిన అరటి గెలలను దీపావళి పండుగ మరుసటి రోజున తీసుకొచ్చి వేలంలో విక్రయిస్తారు. ఈ అరటిగెలలను దక్కించుకునేందుకు ఖండవల్లి గ్రామస్తులతో పాటు ఇతర ప్రాంతాల వాళ్ళు పోటీ పడతారు. ఇలా ఆలయాలకు అలంకరించిన అరటి గెలలను రాముని ప్రసాదంగా భావిస్తారు. పండగవేళ వాటిని దక్కించుకుంటే ఆ ఏడాదంతా వారికి మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ ఆచారం తరతరాలుగా తమ గ్రామంలో కొనసాగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బొద్దింకను చంపబోయి.. అపార్ట్‌మెంట్‌కే నిప్పటించింది
సముద్ర తీరంలో భారీ కళేబరం.. దగ్గరికెళ్లి చూస్తే
వాట్సాప్ కీలక అప్‌డేట్… ఇకపై చాట్ జీపీటీ పని చేయదు
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్..
హైదరాబాద్కు బీచ్ వచ్చేస్తోందోచ్

