AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంటిమిట్టలో అద్భుతం..600 అడుగుల రామయ్య విగ్రహం

ఒంటిమిట్టలో అద్భుతం..600 అడుగుల రామయ్య విగ్రహం

Phani CH
|

Updated on: Sep 26, 2025 | 3:23 PM

Share

ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్టలో మరో అద్భుత ఆవిష్కరణకు టీటీడీ రంగం సిద్ధం చేస్తోంది. దక్షిణ అయోధ్య స్థాయిలో ఒంటిమిట్టను తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్షేత్రానికి జాతీయ స్థాయిలో పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్థం చేస్తోంది.

ఇందులో భాగంగా, ఆలయ సమీపంలోని చెరువు మధ్యలో ఏకంగా 600 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయటంతో బాటు పలు కీలక ప్రతిపాదనలను టీటీడీ తెరపైకి తెచ్చింది. ఈ బృహత్ ప్రణాళికను టీటీడీ నియమించిన నిపుణుల కమిటీ రూపొందించింది. విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు ఇటీవలే ఈ రిపోర్టును టీటీడీకి అందజేశారు. రాబోయే 30 ఏళ్లలో ఒంటిమిట్టకు వచ్చే భక్తులు రద్దీని అంచనా వేసి, అందుకు తగిన సౌకర్యాలతో ఈ ప్రణాళికను తీర్చిదిద్దారు. రామాలయం దగ్గరలోని చెరువు కడప-రేణిగుంట జాతీయ రహదారికి, చెన్నై-ముంబై రైలు మార్గానికి మధ్యలో ఉంది. ఈ చెరువు మధ్యలో భారీ రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దితే టూరిస్టులను, భక్తులను విశేషంగా ఆకర్షించవచ్చని నిపుణులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ మాస్టర్ ప్లాన్ అమలైతే ఒంటిమిట్ట క్షేత్రం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందడం ఖాయమని భావిస్తున్నారు. ఒంటిమిట్ట కోదండ రామాలయం గోపుర నిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. 16వ శతాబ్ధంలో ఈ రామాలయాన్ని సందర్శించిన ఫ్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్‌ భారతదేశంలోనే ఉన్న అతిపెద్ద ఆలయ గోపురాలలో ఒంటిమిట్ట ఆలయ గోపురం ఒకటని కీర్తించాడు. ఈ ఆలయంలోని మరో విశిష్టత ఏమిటంటే.. ఇక్కడ హనుమంతుడు ఉండడు. భారతదేశంలోనే హనుమంతుడు లేని ఏకైక రామాలయం ఇది. అంతేకాదు ఈ ఆలయంలో సీతా,రామ,లక్ష్మణులు ఒకే శిలపై ఉండటంతో ఈ ప్రాంతం ఏకశిలానగరంగా ప్రసిద్ధి చెందింది. ఈ కోదండ రామాలయానికి మూడు గోపురద్వారాలతో, విశాలమైన ఆవరణలో అద్భుతంగా ఉంటుంది. 160 అడుగుల ఆలయ ముఖద్వారంతో, 32 శిలా స్తంభాలతో కూడిన రంగమంటపం ఆకట్టుకుంటుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Venezuela Earthquake: భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

పట్టపగలు దారిదోపిడీ..ఏకంగా కోట్ల విలువైన బంగారం దోచేశారు

పద్ధతి మార్చుకోమన్న పై అధికారిని బెల్టుతో కొట్టిన హెడ్మాస్టర్‌.. కారణం ఇదే

అమ్మో కోతి.. రైతు చెవి కొరికి తీసుకుపోయిన మర్కటం

Weather Update: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన10 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్