Venezuela Earthquake: భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
ప్రపంచంలోని పలు దేశాలను ప్రకృతి వైపరీత్యాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఓవైపు భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. మరోవైపు వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఇటీవల రష్యాలోని కమ్‌చట్కా ద్వీపకల్పంలో వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేసాయి.
తాజాగా దక్షిణ అమెరికాలోని వెనిజులాలో భారీ భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 6.2 తీవ్రతతో భారీ ప్రకంపనలు వచ్చాయి. జులియా రాష్ట్రంలోని మెనేగ్రాండే ప్రాంతానికి తూర్పు-ఈశాన్య దిశలో 24 కిలోమీటర్ల దూరంలో, రాజధాని కారకాస్‌కు పశ్చిమాన 600 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్ర ఉన్నట్టు కొలంబియన్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూ అంతర్భాగంలో 7.8 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. భూకంప తీవ్రతతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. వెనిజులాలోని ప్రధాన నగరాలైన కారకాస్, మారాకైబోతోపాటు పొరుగున ఉన్న కొలంబియా, కరీబియన్ నెదర్లాండ్స్, కరసౌ, అరుబాలతోపాటు మొత్తం ఆరు దేశాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ముఖ్యంగా వెనిజులా, కొలంబియాలో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పట్టపగలు దారిదోపిడీ..ఏకంగా కోట్ల విలువైన బంగారం దోచేశారు
పద్ధతి మార్చుకోమన్న పై అధికారిని బెల్టుతో కొట్టిన హెడ్మాస్టర్.. కారణం ఇదే
అమ్మో కోతి.. రైతు చెవి కొరికి తీసుకుపోయిన మర్కటం
Weather Update: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
నిప్పుల కొలిమిలా ఏపీ...54 మండలాల్లో తీవ్ర వడగాలుల ముప్పు!
50 రోజులు జైల్లో 25 హోటల్లో.. 19 గంటలు బస్సులో..
పాకిస్థాన్‌లో పెట్రో మంటలు.. లీటరు ఎంతో తెలుసా?
కిరాణా వ్యాపారి ఖతర్నాక్ స్కెచ్..పేదల బంగారం స్వాహా
ఓర్నీ.. విమానంలో ఉన్నప్పుడు.. నీకిదేం పోయేకాలం రా
అబ్బా.. ఈ కోతి ఎంత మంచిదో.. సంస్కారానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
బిర్యానీలో లెగ్ పీస్‌లు లేవని.. పెళ్లి పందిట్లో విరిగిన కుర్చీలు

