Viral Video: ఏంటి మావా.! స్కూటీని ఇలా కూడా స్టార్ట్ చేస్తారా.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..

అప్పుడప్పుడూ మనం అనుకోని అనూహ్య సంఘటనలే.. కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తే.. ఇంకొన్ని నవ్వు తెప్పిస్తాయి. అలాంటి ఓ వీడియో..

Viral Video: ఏంటి మావా.! స్కూటీని ఇలా కూడా స్టార్ట్ చేస్తారా.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..
Viral Video
Follow us

|

Updated on: Mar 23, 2023 | 9:23 AM

అప్పుడప్పుడూ మనం అనుకోని అనూహ్య సంఘటనలే.. కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తే.. ఇంకొన్ని నవ్వు తెప్పిస్తాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మీరు కూడా దాన్ని చూస్తే కచ్చితంగా కడుపుబ్బా నవ్వుతారు. మరి లేట్ ఎందుకు అదేంటో తెలుసుకుందామా..

వైరల్ వీడియో ప్రకారం.. పెట్రోల్ బంక్‌లో ఓ వ్యక్తి.. తన స్కూటీలో పెట్రోల్ కొట్టించుకుని.. బండి స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. అది స్టార్ట్ కాదు. అందుకే కిక్కు కొట్టి స్టార్ట్ చేయాలనుకుంటాడు. అతడు ఓ చేత్తో హ్యాండిల్ పట్టుకుని, కాలితో కిక్ కొడతాడు. అలా కొడుతూనే ఉంటాడు.. బండి మాత్రం స్టార్ట్ కాదు.. ఇలా పదేపదే ప్రయత్నించేటప్పటికీ ఒక్కసారిగా అది స్టార్ట్ అయ్యి.. ముందున్న ఏటీఎంలోకి దూసుకెళ్తుంది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా బర్సూర్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.