Viral Video: కుడి ఎడమైతే పొరపాటే.. ఈ ఫన్నీ వీడియో పై ఓ లుక్ వేయండి మరి..

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది, ఇది ఇప్పటివరకు 10 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ ని సొంతం చేసుకుంది వీడియో..

Viral Video: కుడి ఎడమైతే పొరపాటే.. ఈ ఫన్నీ వీడియో పై ఓ లుక్ వేయండి మరి..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: May 10, 2022 | 6:20 PM

Viral Video: సోషల్ మీడియాలోని(Social Media) వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రతిరోజూ వేల రకాల వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు.. అయితే వాటిలో కొన్ని మాత్రమే వైరల్ (Viral Videos) అవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫన్నీ వీడియోలను ఎన్ని సార్లు చూసినా పదే పదే చూడాలనిపిస్తాయి. ఒకొక్కసారి ఆ వీడియోల్లోని సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుని మరీ నవ్వుకుంటాం..ఇలాంటి ఫన్నీ వీడియోలను ప్రజలు ఇష్టపడతారు. ఎందుకంటే ఇలాంటి ఫన్నీ వీడియోలు చూస్తుంటే.. మానసికంగా సంతోషంగా ఉంటాం.. ఒత్తిడి తగ్గి.. రిలాక్స్ అవుతాం.. తాజాగా ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని చూస్తే మీరు కూడా నవ్వకుండా ఉండలేరు..

ఒకొక్కసారి మనిషి మతిమరపు.. ఫన్నీగా నవ్వుకునే విధంగా ఉంటుంది. కళ్ళకు కళ్ళజోడు పెట్టుకుని.. అది కనిపించడం లేదంటూ.. ఇల్లంతా వెదికిన వారిని చూసినా.. వేరు శనగ గింజలు పడేసి.. వాటి తొక్కలను నోట్లో వేసుకున్న సందర్భాలు గుర్తుకు తెచ్చుకున్నా.. పెదవుల మీద నవ్వు వస్తుంది.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కూడా నవ్వు తెప్పించే మతిమరపు సంఘటనే చోటు చేసుకుంది. ఓ యువకుడు కాలువ ఒడ్డుకు వెళ్ళాడు.. అక్కడ నిలబడి.. ఓ చేపని చేతుల్లోకి తీసుకుని.. మరో చేత్తో..సెల్ ఫోన్ లో దాని ఫోటోలు రకరకాల యాంగిల్స్ లో తీసుకున్నాడు. చేప ఫోటోలను తీసిన తర్వాత.. పొరపాటున చేపని నీటిలో పడెయ్యబోయి.. కుడిచేతిలో ఉన్న సెల్ ఫోన్ ని నీటిలోకి విసిరేశాడు..దానికి బై కూడా చెప్పాడు… అప్పుడు కూడా తన పొరపాటు గుర్తించలేదు.. ఎడమ చేతిలో ఉన్న చేపను ప్యాంట్ పాకెట్ లో పెట్టుకోవడానికి ట్రై చేశాడు. అయితే చేప.. జేబులో పెడుతుండగా అప్పుడు తాను చేసిన పొరపాటుని గుర్తించాడు. తన తప్పు తెలుసుకుని నాలిక కరుచుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో in_this_reels పేరుతో షేర్ చేయబడింది. ఈ వీడియో 10 లక్షల వ్యూస్ ని 1 లక్ష 55 వేల లైక్స్ ని సొంతం చేసుకుంది. ఈ వీడియో  చూసిన తర్వాత అనేక ఫన్నీ కామెంట్లు కూడా దర్శనమిస్తున్నాయి. అతని పెయిన్ ని నేను ఫీల్ అవుతున్నా అని ఒకరు.. యువకుడి చేతిలో మొబైల్ లేదు, మొబైల్ కవర్ మాత్రమే ఉంది.. దానినే నీటిలో పడేశాడు అంటూ మరొకరు కామెంట్ చేశారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..