Viral Video: సోషల్ మీడియాలో లైక్స్ కోసం.. స్టంట్స్ చేయబోయి బొక్కబోర్లాపడ్డాడు.. వీడియో వైరల్
చేతిలో సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో బతికేస్తున్నారు. రాత్రి పగలూ అనే తేడా లేకుండా బిజీ బిజీగా గడిపేస్తున్నారు. కనీసం పక్కనున్న వారితోనూ మాట్లాడలేనంతగా మారిపోతున్నాయు. తాము పెట్టే పోస్టులకు...
చేతిలో సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో బతికేస్తున్నారు. రాత్రి పగలూ అనే తేడా లేకుండా బిజీ బిజీగా గడిపేస్తున్నారు. కనీసం పక్కనున్న వారితోనూ మాట్లాడలేనంతగా మారిపోతున్నాయు. తాము పెట్టే పోస్టులకు వ్యూస్, లైక్స్, కామెంట్స్ ఎన్ని వచ్చాయో చూసుకుంటూ టైమ్ పాస్ చేసుకుంటారు. అయితే ఈ కాలంలో సోషల్ మీడియాలో చాలా మంది ఫేమస్ అవుతున్నారు. వారు చేసే చిన్న చిన్న పనులు, డ్యాన్స్, పాటలతో వైరల్ గా మారుతున్నారు. ఇలాంటి వారిని చూసి తామూ వారిలా ఫేమస్ అవ్వాలని నేటి యువత ఉరకలేస్తోంది. ఇందుకోసం ప్రమాదాలు ఎదురైనా పట్టించుకోవడం లేదు. లైకులు, కామెంట్ల కోసం ప్రాణాలనే పణంగా పెట్టేస్తున్నారు. ఇలాంటి వీడియోలో నెట్టింట్లో చాలానే ఉన్నాయి. అంతే కాకుండా వీటిని చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది బైక్ స్టంట్స్ చేస్తుంటారు. ఇలా చేసేందుకు ఎంతో ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మనం చేసే చిన్న తప్పు భారీ మూల్యానికి కారణమవుతుంది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో ఓ వ్యక్తి.. బైక్ పై స్టంట్స్ చేస్తూ వేగంగా వెళ్తుంటాడు. అతడు బైక్‌ను ఒక చక్రం మీద ఎత్తుకుని నడపిస్తాడు. అలా స్టంట్స్ చేస్తున్న సమయంలో అక్కడే పార్క్ చేసి ఉన్న కారును ఢీకొట్టి కింద పడిపోతాడు. అయితే ఎంతో వేగంగా ప్రమాదం జరిగినట్లు కనిపించానా.. ఆ యువకుడికి కనీసం గాయాలు కూడా కాకపోవడం గమనార్హం.
meek mill is so unserious pic.twitter.com/qpkC3ou6ol
— гг ~ ? (@tize4PF) September 21, 2022
ఈ స్టంట్ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఇప్పటి వరకు వీడియోకు 26 లక్షల వ్యూస్, 72.6 వేల లైక్స్ వచ్చాయి. ఈ సంఖ్య వేగంగా పెరుగుతోంది. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం