AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిలో టీ పొడి రూ.9 కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ చాయ్ గురించి తెలుసా..?

ఈ టీ ధర వింటే మీ గొంతు ఎండిపోవడం ఖాయం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీగా ఇది పాపులర్.. 20 గ్రాముల టీ పొడితో ఒక మధ్యతరగతి కుటుంబం ఇల్లు కట్టుకోవచ్చంటే దీని విలువ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చైనా ప్రభుత్వం జాతీయ సంపదగా ప్రకటించిన ఈ టీ ఎందుకంత స్పెషల్? కేవలం 6 మొక్కల నుండి వచ్చే ఈ టీ ఆకులు బంగారం కంటే ఖరీదు ఎందుకయ్యాయో తెలుసుకుందాం..

కిలో టీ పొడి రూ.9 కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ చాయ్ గురించి తెలుసా..?
World Most Expensive Tea
Krishna S
|

Updated on: May 11, 2026 | 12:43 PM

Share

మనం ఉదయాన్నే తాగే ఒక కప్పు టీ ధర ఎంత ఉంటుంది? మహా అయితే 10 రూపాయలు.. ఏదైనా స్టార్ హోటల్‌కు వెళ్తే వెయ్యి రూపాయలు. కానీ ప్రపంచంలో ఒక రకమైన టీ ఉంది, దాని ధర వింటే మీరు టీ తాగడం మానేసి ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు. కిలో ధర అక్షరాలా రూ.9 కోట్లు.. అవును మీరు చదివింది నిజమే. ఒక విలాసవంతమైన బంగ్లా లేదా లగ్జరీ కారు కంటే ఖరీదైన ఈ టీ పేరే డా హాంగ్ పావో. చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఉన్న వుయి పర్వతాల కొండచరియలపై ఈ టీ పెరుగుతుంది. దీనిని బిగ్ రెడ్ రోబ్ అని కూడా పిలుస్తారు. దీని ధర ఎందుకు అంతలా ఉంటుంది అంటే, ఇది పండించే విధానం, దీని చరిత్రే ప్రధాన కారణం. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ ప్రకారం.. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన టీ. 2002లో జరిగిన ఒక వేలంలో కేవలం 20 గ్రాముల ఈ టీ పొడి సుమారు రూ. 26.17 లక్షలకు అమ్ముడైందంటే దీని డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఒక చారిత్రక నేపథ్యం

ఈ టీకి ఆ పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. మింగ్ రాజవంశం కాలంలో ఒక రాణి తీవ్ర అనారోగ్యానికి గురైతే, ఈ టీ తాగడం వల్ల ఆమె ప్రాణాలు దక్కాయట. దానికి కృతజ్ఞతగా చక్రవర్తి ఆ తేయాకు మొక్కలను ఎర్రటి రాజ వస్త్రాలతో కప్పించాడట. అందుకే దీనికి డా హాంగ్ పావో అని పేరు వచ్చింది. నాటి నుండి దీనిని చైనాలో ఒక రాజసంపదగా, దైవప్రసాదంగా భావిస్తారు.

దీని రుచి అంత ప్రత్యేకమా..?

పర్వతాల పగుళ్లలో పెరిగే ఈ మొక్కలు అక్కడి ఖనిజాలను అధికంగా గ్రహిస్తాయి. అందుకే దీనిని రాక్ టీ అని కూడా పిలుస్తారు. దీనికి గాఢమైన మట్టి వాసనతో కూడిన తియ్యటి రుచి ఉంటుంది. ఈ టీ తాగిన చాలా సేపటి వరకు ఆ సువాసన గొంతులోనే నిలిచి ఉంటుందని టీ నిపుణులు చెబుతుంటారు.

బంగారం కంటే ఖరీదు ఎందుకు..?

అరుదైన మాతృ మొక్కలు: వందల సంవత్సరాల వయస్సు గల కేవలం ఆరు మాతృ పొదల నుండి మాత్రమే అసలైన టీ సేకరిస్తారు.

ప్రభుత్వ నిషేధం: 2006 నుండి చైనా ప్రభుత్వం ఈ పురాతన మొక్కల నుండి ఆకులను కోయడాన్ని పూర్తిగా నిషేధించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నది పాత నిల్వలు మాత్రమే.

జాతీయ సంపద: ఈ మొక్కలను రక్షించడానికి సాయుధ కాపలాదారులను కూడా నియమించారంటే దీని విలువ ఎంతో అర్థం చేసుకోవచ్చు.

నేడు మార్కెట్లో లభించే డా హాంగ్ పావో టీ పొడి.. అసలు మొక్కల నుండి వచ్చిన కొమ్మల ద్వారా పెంచిన మొక్కల నుండి తయారవుతోంది. ఇవి కూడా ఖరీదైనవే అయినప్పటికీ మాతృ మొక్కల నుండి వచ్చిన ఆకుల విలువ గ్రాముకు రూ.1.5 లక్షలు ముందు ఇవి సరితూగవు.

Follow Us