AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గర్భిణీలు కనిపిస్తే పాములు అలా చేస్తాయా.. ప్రకృతి కాపాడుతుందా..? పురాణాల్లో దాగున్న రహస్యాలు..

సృష్టికి మూలమైన తల్లిని ప్రకృతే స్వయంగా రక్షిస్తుందా? గర్భిణీలను పాములు కరవవు అనే ప్రచారం వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏమిటి? భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో తరతరాలుగా ప్రచారంలో ఉన్న ఈ విశ్వాసం వెనుక ఉన్న పౌరాణిక, జ్యోతిష్య మూలాలేంటి? ఆధునిక వైద్య శాస్త్రం దీనిపై ఎలాంటి హెచ్చరికలు చేస్తుంది? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

గర్భిణీలు కనిపిస్తే పాములు అలా చేస్తాయా.. ప్రకృతి కాపాడుతుందా..? పురాణాల్లో దాగున్న రహస్యాలు..
Do Snakes Bite Pregnant Women
Krishna S
|

Updated on: Jul 21, 2026 | 6:13 PM

Share

మన దేశంలో గట్టిగా పాతుకుపోయిన విచిత్రమైన నమ్మకాల్లో గర్భిణీ స్త్రీలను పాములు కాటు వేయవు అనేది ఒకటి. ఇప్పటికీ అనేక పల్లెల్లో అమ్మమ్మలు, నాయనమ్మల నోటి వెంట ఈ మాట వినిపిస్తూనే ఉంటుంది. సృష్టి పరిణామానికి కారణమయ్యే మాతృత్వాన్ని ప్రకృతి ఆటోమేటిక్‌గా రక్షిస్తుందని కొందరు విశ్వసిస్తే.. దీని వెనుక జ్యోతిష్య కారణాలు ఉన్నాయని మరికొందరు వాదిస్తారు. పురాణాల ప్రకారం.. గర్భం దాల్చిన మహిళను సాక్షాత్తు ఆదిశక్తి రూపంగా పరిగణిస్తారు. శివకేశవుల అలకారాలైన సర్పాలు.. మహిళ కడుపులోని జీవాన్ని గుర్తించగలవని, సృష్టిని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమానికి ఆటంకం కలిగించకుండా అవి పక్కకు తొలిగిపోతాయని పౌరాణిక కథలు చెబుతున్నాయి. మరోవైపు జ్యోతిష్య రీత్యా చూస్తే.. పాములను రాహు-కేతువుల స్వరూపంగా భావిస్తారు. గర్భధారణ సమయంలో మహిళ చుట్టూ ఒక ప్రత్యేకమైన సానుకూల ఆరా ఏర్పడుతుందని.. ఇది ప్రతికూల గ్రహాల తీవ్రతను తగ్గించి సర్పాలు దాడి చేయకుండా నిరోధిస్తుందని జ్యోతిష్య నిపుణుల నమ్మకం.

సైన్స్ ఏమంటుంది..?

వైద్య నిపుణులు, జీవశాస్త్రవేత్తలు మాత్రం ఈ నమ్మకాన్ని పూర్తిగా కొట్టిపడేస్తున్నారు. పాములకు ఎదుటి వ్యక్తి పురుషుడా, స్త్రీయా లేదా గర్భిణీనా అని గుర్తించే విచక్షణ జ్ఞానం ఉండదని సైన్స్ స్పష్టం చేస్తుంది. పాము కాటు వేయడం అనేది కేవలం తనను తాను రక్షించుకోవడానికి చేసే ఆత్మరక్షణ చర్య మాత్రమే. పొరపాటున కాలు పడినా లేదా ప్రమాదాన్ని పసిగట్టినా అది ఎవరినైనా కాటు వేస్తుంది. గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల వచ్చే వాసన పాములను దూరంగా ఉంచుతుందనే ప్రచారానికి కూడా ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

సంస్కృతి, సంప్రదాయాలను పక్కన పెడితే.. ప్రాణాల విషయంలో విశ్వాసాల కంటే హెచ్చరికలే ముఖ్యం. చీకటి ప్రదేశాలు లేదా పొదల్లోకి వెళ్లేటప్పుడు గర్భిణీలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ అవాంఛనీయంగా పాము కాటుకు గురైతే నమ్మకాలపై ఆధారపడకుండా వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లేలా చూడటమే సురక్షితం.

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే