Viral Video: గురుత్వాకర్షణ శక్తికే సవాలు విసిరారు.. దుమ్మురేపిన ఆంటీల డాన్స్.. మాములుగా లేదండోయ్..
రెండు రోజుల క్రితం పోస్ట్ చేసిన వీడియోలో, ఒక కార్యక్రమంలో ముగ్గురు మహిళలు డ్యాన్స్ చేశారు. అక్కడున్నవారంత చప్పట్లు కొడుతూ వారిని మరింత ఎంకరేజ్ చేస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్ చేసే వారి గురించి చెప్పక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు వయసుతో సంబంధం లేకుండా స్టెప్పులతో అదరగొడుతున్నారు. ఇక కొందరు పెద్దవారు చేసే డాన్స్ వీడియోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. వాటిలో కొన్ని చాలా అందంగా, ఆసక్తికరంగా ఉంటే మరికొన్ని చాలా ఫన్నీగా , ఉల్లాసంగా ఉంటాయి. తాజాగా ముగ్గురు చేసిన డాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. రెండు రోజుల క్రితం పోస్ట్ చేసిన వీడియోలో, ఒక కార్యక్రమంలో ముగ్గురు మహిళలు డ్యాన్స్ చేశారు. అక్కడున్నవారంత చప్పట్లు కొడుతూ వారిని మరింత ఎంకరేజ్ చేస్తున్నారు.
అయితే ఈ ముగ్గురు మహిళలు సరదాగా డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది. అందులో ధోల్ బీట్ కు అనుగుణంగా హావాభావాలు పలికిస్తూ.. సూపర్ ఫాస్ట్ డ్యాన్స్ సెప్టులు వేస్తూ అదరగొట్టారు. వీరి డాన్స్ చూసిన నెటిజన్స్ షాకవుతున్నారు. వారి డ్యాన్స్ గురుత్వాకర్షణ శక్తికే సవాలు విసిరారంటూ కామెంట్స్ చేస్తున్నారు. జీరో గ్రావిటీ డ్యాన్స్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ముగ్గురు మహిళలు చేసిన డాన్స్ వీడియో మాత్రమే నెట్టింటిని షేక్ చేస్తుంది.




View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.