Viral: భర్తపై కేసు పెట్టిన భార్య.. కారణం తెలిసి ఆశ్చర్యపోయిన జస్టిస్‌

తాజాగా బెంగళూరులో చోటు చేసుకున్న ఓ సంఘటన చూస్తే వామ్మో దీనికి కూడా కేసులు పెడతారా.? అన సందేహం రాకమానదు. చూసే వారికే కాదు విచారిస్తున్న జస్టిస్‌కు సైతం ఇలాంటి భావనే కలిగింది. తన భర్తపై భార్య కేసు పెట్టడానికి గల కారణం తెలుసుకున్న జస్టిస్‌ ఆశ్చర్యపోయాడు. ఇంతకీ భార్య ఏమని ఫిర్యాదు చేసింది...

Viral: భర్తపై కేసు పెట్టిన భార్య.. కారణం తెలిసి ఆశ్చర్యపోయిన జస్టిస్‌
Viral News
Follow us

|

Updated on: Aug 24, 2024 | 12:37 PM

భార్య, భర్తల మధ్య గొడవలు రావడం సర్వసాధారణమైన విషయం. ఇందుకు ఎన్నో కారణాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ గొడవలు తీవ్రరూపం కూడా దాల్చుతుంటాయి. ఒకరిపై ఒకరు పోలీస్‌ స్టేషన్స్‌లో కూడా ఫిర్యాదు చేసుకుంటుంటారు. అయితే ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌ వరకు చేరాలంటే ఏదో పెద్ద కారణమే ఉంటుందని అంతా భావిస్తుంటారు. కానీ ఇటీవల సిల్లీ రీజన్స్‌ కూడా ఆలుమగలు పోలీస్ట్ స్టేషన్‌ గడప తొక్కుతున్నారు.

తాజాగా బెంగళూరులో చోటు చేసుకున్న ఓ సంఘటన చూస్తే వామ్మో దీనికి కూడా కేసులు పెడతారా.? అన సందేహం రాకమానదు. చూసే వారికే కాదు విచారిస్తున్న జస్టిస్‌కు సైతం ఇలాంటి భావనే కలిగింది. తన భర్తపై భార్య కేసు పెట్టడానికి గల కారణం తెలుసుకున్న జస్టిస్‌ ఆశ్చర్యపోయాడు. ఇంతకీ భార్య ఏమని ఫిర్యాదు చేసింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

బెంగళూరుకు చెందిన ఓ మహిళ.. తన భర్తను నను వేధిస్తున్నాడంటూ.. గృహ హింస చట్టం కింద పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇంతకీ కేసు నమోదు చేసే సమయంలో ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఏంటో తెలుసా.? భర్త ఫ్రెచ్‌ ఫ్రైస్‌ తిననీయడం లేదని. అవును కాన్పు అనంతరం పౌష్టికాహారం, పండ్లు, పాలు వంటివి కాకుండా బంగాళ దుంపలతో చేసిన ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తినొద్దన్నందుకు తనపైనే భార్య కేసు పెట్టిందని ఆ వ్యక్తి మొరపెట్టుకున్నాడు.

దీంతో ఆమె వాదన సరికాదని తనపై నమోదైన కేసును రద్దు చేయాలంటూ ఆమె భర్త కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై స్పందించిన జస్టిస్‌ ఎం.నాగప్రసన్న ఆశ్చర్యపోయారు. భార్య ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని తినొద్దని వారిస్తే ఎదురు కేసు పెట్టడం సరికాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అన్ని చోట్లా అతనిపై నమోదైన కేసులపై స్టే విధిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

శ్రీశైలం డ్యామ్‌కు ఎమర్జెన్సీ సైరన్.. ఏ క్షణమైనా గేట్లను..
శ్రీశైలం డ్యామ్‌కు ఎమర్జెన్సీ సైరన్.. ఏ క్షణమైనా గేట్లను..
కొంపముంచిన కత్తెర.. 36 విమానాలు రద్దు,200 విమాన సర్వీసులు ఆలస్యం.
కొంపముంచిన కత్తెర.. 36 విమానాలు రద్దు,200 విమాన సర్వీసులు ఆలస్యం.
మీరు మారరా ఇక.. ఈ కేటుగాళ్ల స్కెచ్‌కి పోలీసులకే మైండ్ బ్లాంక్
మీరు మారరా ఇక.. ఈ కేటుగాళ్ల స్కెచ్‌కి పోలీసులకే మైండ్ బ్లాంక్
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ బ్రన్యాస్‌ కన్నుమూత.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ బ్రన్యాస్‌ కన్నుమూత.
కొందరు ఉద్యోగుల కళ్లలో నీళ్లు.. స్పృహ తప్పి పడిపోయిన మరికొందరు.!
కొందరు ఉద్యోగుల కళ్లలో నీళ్లు.. స్పృహ తప్పి పడిపోయిన మరికొందరు.!
ఆఫీసుకెళ్లేందుకు ఏకంగా ప్రైవేట్ జెట్ ఫ్లైట్ కేటాయించిన కంపెనీ.!
ఆఫీసుకెళ్లేందుకు ఏకంగా ప్రైవేట్ జెట్ ఫ్లైట్ కేటాయించిన కంపెనీ.!
బీడీ ముట్టించుకొని అగ్గిపుల్ల కిందపడేశాడు.. క్షణాల్లో ఊహించని
బీడీ ముట్టించుకొని అగ్గిపుల్ల కిందపడేశాడు.. క్షణాల్లో ఊహించని
అక్కా అర్జెంట్ కాల్ చేస్కోవాలి అంటే ఫోన్ ఇచ్చింది.. కట్ చేస్తే.!
అక్కా అర్జెంట్ కాల్ చేస్కోవాలి అంటే ఫోన్ ఇచ్చింది.. కట్ చేస్తే.!
రెచ్చిపోయిన కారు డ్రైవర్‌.. రివర్స్‌ చేసి మరీ దూసుకుపోతూ.. వీడియో
రెచ్చిపోయిన కారు డ్రైవర్‌.. రివర్స్‌ చేసి మరీ దూసుకుపోతూ.. వీడియో
కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌.. వెలుగులోకి మ‌రో సంచ‌ల‌నం
కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌.. వెలుగులోకి మ‌రో సంచ‌ల‌నం