Viral Video: చిన్నదాని ధైర్యం చూస్తే ఫిదా కావాల్సిందే.. గుర్రంతో పోటీపడి స్కేటింగ్ చేసింది.. చివరకు..
తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఓ అమ్మాయి వీడియో చూస్తే మాత్రం మీరు ఫిదా అవుతారు.. ఎందుకో తెలుసుకుందామా ? స్కేటింగ్ చేయడం చాలా మందికి ఇష్టముంటుంది..
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలోనే చిన్నా, పెద్ద ఎక్కువగా గడిపేస్తున్నారు. సమయంతో పనిలేకుండా గంటలు గంటలుగా నెట్టింట మునిగితేలుతున్నారు. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు రీల్స్, షార్ట్ వీడియోస్ అంటూ హంగామా సృష్టిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్ చేసే వారి గురించి చెప్పక్కర్లేదు.. అందులో కొన్ని వీడియోస్ చూస్తే ముచ్చటేస్తుంటుంది.. అలాగే మరికొన్ని వీడియోస్ చూస్తే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఓ అమ్మాయి వీడియో చూస్తే మాత్రం మీరు ఫిదా అవుతారు.. ఎందుకో తెలుసుకుందామా ? స్కేటింగ్ చేయడం చాలా మందికి ఇష్టముంటుంది.. రోడ్డుపై అందంగా.. ఎంతో ఉల్లాసంగా స్కేటింగ చేస్తూ వెళ్లిపోవాలనుకుంటారు.. ఇటీవల ఓ అమ్మాయి చీరకట్టులో రోడ్డుపై స్కేటింగ్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. కేరళ సంప్రదాయ పద్దతిలో దుస్తులు ధరించిన ఆ మహిళ చూడముచ్చటగా స్కేటింగ్ చేసి వావ్ అనిపించుకుంది.. తాజాగా ఓ అమ్మాయి నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద గుర్రంతో పోటీపడి మరీ స్కేటింగ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఆ వీడియో.. ఓ అమ్మాయి నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై స్కేటింగ్ చేస్తుంది. ఆమెతోపాటు.. ఓ కుక్క పిల్ల, ఓ గుర్రం సైతం రోడ్డుపై పరిగెడుతున్నాయి.. ఒక సమయంలో గుర్రం, ఆ అమ్మాయి పోటీపడి పరిగెత్తడం కనిపిస్తుంది. ఆ తర్వాత గుర్రం తన వేగాన్ని తగ్గించడంతో అమ్మాయి సైతం స్లోగా వెళ్లింది.. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇది అద్భుతంగా ఉందని.. తమ మనసుకు ప్రశాంతత ఇచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.. ఆ వీడియోపై మీరు ఓ లుక్కెయ్యండి..
ట్వీట్..
Pure happiness.. ? pic.twitter.com/Bk3aBXkfjc
— Buitengebieden (@buitengebieden) June 16, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.