Watch: పెళ్లికి ముందు యువతి కిడ్నాప్.. గడ్డితో మంట వేసి సప్తపది.. వీడియో వైరల్
ఈ ఘటన జరిగి ఏడు రోజులు గడిచినా బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారి జాడ లేదు. దీంతో ఆందోళనకు దిగుతామని బంధువులు హెచ్చరించారు. మరోవైపు కూతురికి న్యాయం చేయకుంటేఆత్మాహుతి చేసుకుంటామని బాలిక తండ్రి పోలీసులను హెచ్చరించాడు.
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఓ యువతిని కొందరు పోకిరీలు బలవంతంగా ఎత్తుకెళ్లారు. మోహన్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంఖ్లా గ్రామం నుంచి జూన్ 1న యువతి అపహరణకు గురైంది. నగరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ కూడా షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి ఓ యువతిని బలవంతంగా పెళ్లి చేసుకోవడం కనిపించింది.
వైరల్ అవుతున్న వీడియోలో యువతిని తన చేతులతో ఎత్తుకున్న వ్యక్తి స్పస్టం కనిపించాడు. బాధితురాలు వదిలిపెట్టాలంటూ ఏడుస్తూ వేడుకుంటోంది. యువతి పెళ్లికి పది రోజుల ముందు పది మంది దుండుగులు ఆమెను ఎత్తుకెళ్లినట్టుగా బాధితురాలి బంధువులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియోలో కనిపించినట్టుగా.. వారిలో ఒకరు ఆమెను బలవంతంగా వివాహం చేసుకోడానికి ప్రయత్నించాడు. ఆమెను చేతులతో ఎత్తుకుని గడ్డితో వేసిన మంట చుట్టూ ఏడుసార్లు తిరిగి సప్తపది పూర్తయిందని చెప్పాడు. మనకు పెళ్లైపోయిందని, ఇంకొకర్ని పెళ్లి చేసుకోవద్దని బదిరించి వదలిపెట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనను కాపాడమంటూ యువతి కేకలు వేయడం కూడా వైరల్ వీడియోలో వినిపిస్తోంది.
कुख्यात कांग्रेस कुशासन में जंगलराज कायम!
जैसलमेर में युवती का सरेआम अपहरण कर बंजर वीराने में उसके साथ जबरदस्ती शादी कर ली जाती है। ना कोई पुलिस आई, ना गिरफ्तारी हुई? सत्ता के संरक्षण में ऐसी घटनाओं से राजस्थान शर्मसार है! इन सब पर कब लगाम लगेगी ? कब तक हमारी बहन-बेटियां डर के… https://t.co/aIecGx7e6L pic.twitter.com/4h3omNXgOl
— Col Rajyavardhan Rathore (@Ra_THORe) June 6, 2023
ఈ ఘటన జరిగి ఏడు రోజులు గడిచినా బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారి జాడ లేదు. దీంతో ఆందోళనకు దిగుతామని బంధువులు హెచ్చరించారు. మరోవైపు కూతురికి న్యాయం చేయకుంటేఆత్మాహుతి చేసుకుంటామని బాలిక తండ్రి పోలీసులను హెచ్చరించాడు.
నివేదికల ప్రకారం, వ్యక్తి మొదట మహిళను కిడ్నాప్ చేసి, ఆపై ఆమెను బలవంతంగా వివాహం చేసుకున్నాడు. ఓ కుర్రాడు ఓ అమ్మాయిని తన ఒడిలో పెట్టుకుని కాలుతున్న గడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వీడియోలో కనిపిస్తోంది. ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని స్వాతి మలివాల్ రాజస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం