Viral Video: పిల్లి కాదు.. అక్కడున్నది పెద్దపులి.. పరాచకాలాడింది.. దెబ్బకు నోటికి చిక్కింది.!
బోనులో ఉన్నా.. బయట ఉన్నా.. పులి.. పులే.! వేటాడటం దాని సహాజ లక్షణం. పిల్లిలా వాటిని ముద్దు చేస్తామంటే కుదరదు. వేటాడేస్తాయి. నోటపట్టేందుకు ప్రయత్నిస్తాయి.
బోనులో ఉన్నా.. బయట ఉన్నా.. పులి.. పులే.! వేటాడటం దాని సహాజ లక్షణం. పిల్లిలా వాటిని ముద్దు చేస్తామంటే కుదరదు. వేటాడేస్తాయి. నోటపట్టేందుకు ప్రయత్నిస్తాయి. సరిగ్గా ఓ యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. కుక్కనో, పిల్లినో ముద్దు చేస్తున్నట్లు.. పులిని ముద్దు చేయాలని చూసింది. దెబ్బకు ఊహించని ప్రమాదంలో పడింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందామా..
వైరల్ వీడియో ప్రకారం.. ఓ యువతి పెద్దపులి తల నిమిరుతూ కనిపిస్తుంది. ఇక అదే ఆమెను చిక్కుల్లో పడేస్తుంది. కాసేపు పులి తలపై చెయ్యిపెట్టి సదరు యువతి నిమిరుతుంది. అంతవరకూ బాగానే ఉంది. కానీ కాసేపటికి పులి ఆమె చెయ్యి నోటకరిచిపట్టుకుంటుంది. పులి లంచ్ బ్రేక్ తీసుకున్నట్లుగా అనిపించినా.. ఆమె మాత్రం దెబ్బకు దడుసుకుంటుంది. పులి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ప్రతీసారి.. అది మరింత గట్టిగా పట్టుకుంది. దొరికితే చెయ్యి.. దొరక్కపోతే కాలు అన్నట్లుగా పులి నోట కరిచేందుకు ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో సదరు మహిళ మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. పులి ఊహించని దాడికి చుట్టూ ఉన్నవారు కూడా ఒక్కసారిగా షాకయ్యారు.
మరి నెక్స్ట్ ఏమైందో.? ఏంటో.? తెలియదు గానీ.. పులికి మాత్రం కోపం తెప్పించకుండా మిగిలినవారంతా సైలెంట్‌గానే ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. క్రూర జంతువులతో పరిహాసాలు ఆడకూడదని కొందరు హితబోధ చేస్తుంటే.. బోనులో ఉన్నా.. బయట ఉన్నా పులి పులే.. పిల్లి అని మాత్రం అనుకోవద్దని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.
View this post on Instagram