Viral News: రోదసిలో పులియబెట్టిన వైన్ బాటిల్ వేలం.. ధర తెలిస్తే మైండ్ బ్లాంక్
ఇది అంతరిక్షంలో పులియబెట్టిన వైన్. పేరు పెట్రన్ 2000. ధర కూడా అందనంత దూరంలో ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష.....
రోదసిలో పులియబెట్టిన వైన్ బాటిల్ వేలం 7.37 కోట్లు ధర పలకవచ్చని భావిస్తోన్న క్రిస్టీస్ జీరో గ్రావిటీ వాతావరణంలో పులిసిన వైన్ టేస్ట్ వేరు
ఇది అంతరిక్షంలో పులియబెట్టిన వైన్. పేరు పెట్రన్ 2000. ధర కూడా అందనంత దూరంలో ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సంవత్సర కాలం ఉన్న ఈ ఫ్రెంచ్ వైన్ బాటిల్‌ను క్రిస్టీస్ వేలానికి పెట్టింది. పది లక్షల డాలర్లు అంటే దాదాపు 7.37 కోట్లరూపాయలు ధర పలకొచ్చని భావిస్తున్నారు. ఈ సీసా 2019 నవంబర్‌లో అంతరిక్షంలోకి పంపిన 12 వైన్ సీసాల్లో ఇది ఒకటి. భూమికి వెలుపల సేద్యానికి అవకాశాలపై పరిశోధనలో భాగంగా ప్రైవేట్ స్టార్టప్ సంస్థ స్పేస్ కార్గో అన్‌లిమిటెడ్ వైన్ బాటిల్స్‌ను అక్కడకు పంపింది., 14 నెలల తర్వాత వాటిని భూమికి రప్పించింది.
వీటికి ఫ్రాన్స్‌లోనిబోర్డోలో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఫర్ వైన్ అండ్ వైన్ రీసెర్చ్‌లో పరిశోధకులు రుచి పరీక్షలు నిర్వహించారు. భూమిపై అంతేకాలంపాటు పులియబెట్టిన వైన్‌తో దీన్ని పోల్చి చూసారు. రుచిలో రెండింటి మధ్య తేడా గుర్తించారు. రోదసిలోకి వెళ్ళొచ్చిన పానీయం మృదువుగా సువాసనభరితంగా ఉందన్నారు. జీరో గ్రావిటీ ఉన్న ప్రత్యేక వాతావరణంలో ఈ వైన్ పరిపక్వానికి వచ్చిందట. దీంతో దీని ధర అమాంతం పెరిగిపోయింది.
Also Read: కోవిడ్ ఎఫెక్ట్.. జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి, బల్కంపేట ఎల్లమ్మ ఆలయాల మూసివేత
తెలంగాణలో మే 5, 6 తేదీల్లో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వానలు