Video: భార్య..భర్త.. మధ్యలో ప్రియురాలు.. ఇది మామూలు కథ కాదు.. సినిమాని మించిన స్టోరీ.. వీడియో వైరల్..
భార్య.. భర్త.. మధ్యలో ప్రియురాలు.. సినిమాని మించిపోయే రేంజ్‌లో ఓ భార్య తన భర్తను 70 కిలోమీటర్లు చేజ్ చేసి మరీ హోటల్ గదిలో ప్రియురాలితో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. లోపల దొరికిన రెండో మహిళ కూడా ఆ కేటుగాడి చేతిలో మోసపోయిన బాధితురాలే.. చివరికి ఏమైందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

భార్య, భర్త, ప్రియురాల మధ్య జరిగే హై వోల్టేజ్ డ్రామాలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. కానీ తాజాగా మధ్యప్రదేశ్‌లోని రేవా నగరంలో జరిగిన ఒక ఘటన చూస్తే సినిమా స్టోరీలు కూడా సరిపోవు. తన భర్తకు ఇంకో మహిళతో అఫైర్ ఉందనే అనుమానం రాగానే.. ఆ భార్య ఊరుకోలేదు. ఏకంగా 70 కిలోమీటర్ల దూరం అతడిని ఫాలో అయి.. చివరికి ఒక హోటల్ గదిలో భర్తను ప్రియురాలితో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అంతే కోపంతో ఊగిపోయిన భార్య.. భర్తను కాలర్ పట్టుకుని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి బడితపూజ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ హైడ్రామా వెనుక ఉన్న అసలు కథ చూస్తే షాకవ్వాల్సిందే. సదరు మహిళకు, ఆ కిలాడీ భర్తకు 2025 జూలై 3న మ్యారేజ్ జరిగింది. ఇది ఆమెకు రెండో పెళ్లి, మొదటి భర్త ద్వారా ఆమెకు ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే పెళ్లైన కొన్ని రోజులకే భర్త అసలు రంగు బయటపడింది. ఎవరికీ చెప్పకుండా అకస్మాత్తుగా గాయబ్ అయిపోయాడు. తన మొబైల్ నెంబర్ కూడా మార్చేసి భార్యకు దొరకకుండా తిరగడం మొదలుపెట్టాడు. దీంతో అనుమానం వచ్చిన భార్య.. అతడి గుట్టు తేల్చడానికి స్వయంగా రంగంలోకి దిగింది.
సొంతంగా ఆరా తీయగా.. తన మొగుడు ఒక ప్లేబాయ్ అని, ఆల్రెడీ వేరే అమ్మాయిలతో చక్కర్లు కొడుతున్నాడని కనిపెట్టింది. ప్రస్తుతం రేవా పరిధిలోని సమన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక హోటల్‌లో ఇంకో అమ్మాయితో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడని పక్కా ఇన్ఫర్మేషన్ సంపాదించింది. ఇంకేముంది.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా.. ఏకంగా 70 కిలోమీటర్లు ప్రయాణించి ఆ హోటల్ రూమ్ తలుపు తట్టింది. తలుపు తీయడమే ఆలస్యం.. లోపల భర్త ఇంకో మహిళతో నగ్నంగా ఉన్న దృశ్యం చూసి ఆమె మైండ్ బ్లాంక్ అయింది. దాంతో భార్యకు పూనకం వచ్చేసింది. రూమ్‌లోకి దూరి ఇద్దరినీ బూతుల పురాణంతో ముంచెత్తింది. అంతటితో ఆగకుండా భర్త చెంపలు వాయించేస్తూ, కాలర్ పట్టుకుని ఈడ్చుకుంటూ నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది.
ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. హోటల్ గదిలో దొరికిన రెండో మహిళ కూడా ఆ కేటుగాడి చేతిలో మోసపోయిన బాధితురాలే.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఆమెకు తాను బ్రహ్మచారిని అని అబద్ధాలు చెప్పి వల వేసాడు. కొన్ని రోజుల క్రితమే ఒక గుడిలో ఆమె నుదుటన సింధూరం పెట్టి, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. భార్య ఎంట్రీతో ఆ రెండో అమ్మాయి కూడా నోరెళ్లబెట్టింది. చివరికి ఈ హై వోల్టేజ్ డ్రామా అంతా పోలీస్ స్టేషన్‌కు చేరింది. భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితేదొరికిపోయిన ఆ భర్త పోలీసుల ముందు చెప్పిన సమాధానం వింటే నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. ‘‘ఇందులో నా తప్పేమీ లేదు సార్.. నేను కేవలం పొరపాటున దొరికిపోయాను అంతే’’ అంటూ అడ్డగోలు వాదన మొదలుపెట్టాడు. ప్రస్తుతానికి ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
