AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాము పిల్ల గురించి ఈ నిజాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. చిన్నదే కదా అని లైట్ తీసుకుంటే..

చిన్న పాము పిల్ల కదా.. దీనికి అంత విషం ఎక్కడుంటుంది? కాటు వేసినా పెద్దగా ప్రమాదం కాకపోవచ్చు అనుకుంటున్నారా? అయితే పొరపాటు చేస్తున్నట్లే. ఎందుకంటే గుడ్డు నుండి బయటకు వచ్చిన క్షణం నుంచే పిల్ల ఎంత ప్రమాదకరంగా మారుతుందో తెలిస్తే మీరు అస్సలు నమ్మలేరు. ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆ నిజాలేంటో ఇప్పుడు చూద్దాం..

పాము పిల్ల గురించి ఈ నిజాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. చిన్నదే కదా అని లైట్ తీసుకుంటే..
Are Baby King Cobras Venomous
Krishna S
|

Updated on: Jul 03, 2026 | 11:28 AM

Share

మన దేశంలో వర్షాకాలం మొదలైందంటే చాలు.. అటవీ ప్రాంతాలతో పాటు జనావాసాల్లోనూ పాముల బెడద ఎక్కువ అవుతుంది. సాధారణంగా వేసవి కాలం చివరి భాగం పాములకు అనువైన సంతానోత్పత్తి సమయం కావడంతో ఈ వర్షాలకు గుడ్ల నుండి పొదిగిన పాము పిల్లలు బయటకు రావడం సర్వసాధారణం. అయితే చాలామంది ప్రజలు చిన్న పాము పిల్లలను చూసినప్పుడు.. ‘‘ఇది చిన్నదే కదా, దీనికి అంత విషం ఉండదు.. కాటు వేసినా పెద్దగా ప్రమాదం కాదు’’ అనే ఒక ఘోరమైన అపోహతో ఉంటారు. కానీ నిపుణులు, అంతర్జాతీయ వన్యప్రాణి సంస్థలు చెబుతున్న నిజాలు వింటే ఎవరైనా సరే వణికిపోవాల్సిందే.

పుట్టిన క్షణం నుంచే అత్యంత ప్రమాదకరం..

మీకు తెలుసా? గుడ్డు నుండి పొదిగిన మరుక్షణమే నాగుపాము లేదా కింగ్ కోబ్రా పిల్ల పూర్తిగా, అత్యంత ప్రమాదకరంగా విషపూరితమైనది. పాములకు బాల్యదశ అనే మినహాయింపు కాలం ఏదీ ఉండదు. అంటే, చిన్న వయసులో విషం లేకపోవడం లేదా కాటు తక్కువ తీవ్రతగా ఉండటం లాంటివి అస్సలు జరగవు. వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ వారి బ్రాంక్స్ జూ వంటి ప్రసిద్ధ అంతర్జాతీయ వన్యప్రాణి సంస్థలు ఈ విషయాన్ని స్పష్టంగా నిర్ధారిస్తున్నాయి. పుట్టగానే కింగ్ కోబ్రా పిల్లలు సున్నితంగా ఉండి జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చినప్పటికీ, వాటి ప్రాణాంతక విషంలో మాత్రం తేడా ఏముండదు.

పెద్ద పాము విషమంతే పవర్‌ఫుల్

నిపుణుల పరిశోధనల ప్రకారం.. గుడ్డు నుండి ఇప్పుడే బయటకు వచ్చిన పిల్ల పాము విషం కూడా పెద్ద పాము విషమంతే అత్యంత శక్తివంతమైనది. పుట్టిన మొదటి రోజు నుంచే ఆ విషం మనుషుల నాడీ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసే ఒకే రకమైన మారణాయుధంలా పనిచేస్తుంది. వయసు పెరిగేకొద్దీ మారేది రెండే విషయాలు.. ఒకటి పాము ఎక్కువ మొత్తంలో విషాన్ని వదలగలదు. రెండోది పెద్ద పాము మరింత దూరం నుండి కాటు వేయగలదు. అయితే చిన్న పిల్ల పాము అంత దూరం నుండి దాడి చేయలేకపోవచ్చు.. కానీ అది కూడా తన చిన్న పడగను విప్పి క్షణాల్లో కాటు వేయగలదు.

పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

పాము పిల్లలకు సంబంధించిన మరో లోతైన అపోహ ఏమిటంటే.. ‘‘పిల్ల పాములు తమ విషాన్ని నియంత్రించుకోలేవని, అందుకే కాటు వేసినప్పుడు విషమంతా ఒకేసారి వదిలేస్తాయని’’ చాలామంది అనుకుంటారు. అయితే లోమా లిండా విశ్వవిద్యాలయ పరిశోధకులు ప్రచురించిన ప్రత్యేక అధ్యయనంలో ఈ అపోహను పూర్తిగా ఖండించారు. పిల్ల పాము కాటు వేసినా అది ఖచ్చితంగా తక్షణ వైద్య సహాయం అవసరమయ్యే తీవ్రమైన అత్యవసర పరిస్థితేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. పెద్ద వాటితో పోలిస్తే శరీరంలో విషం తక్కువగా ఉన్నా, ఉన్నంతలో అది ప్రాణాలు తీయడానికి సరిపోతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి పాము పరిమాణం చిన్నగా ఉందని నిర్లక్ష్యం చేయడం మీ ప్రాణాలకే ముప్పు తెచ్చినట్లవుతుంది.

ఒకవేళ పాము లేదా పాము పిల్ల ఎదురైతే.. ఏం చేయాలి?

నెమ్మదిగా వెనక్కి వెళ్ళండి: పాము కనిపిస్తే అకస్మాత్తుగా కదలడం లేదా దానికి వీపు తిప్పి పారిపోవడం చేయవద్దు. అది ఆత్మరక్షణ కోసం దాడి చేసే అవకాశం ఉంది. నెమ్మదిగా వెనక్కి జరుగుతూ పామును మీ దృష్టి పరిధిలోనే ఉంచుకోండి.

సురక్షితంగా ఉంచండి: పిల్లలను, పెంపుడు జంతువులను వెంటనే ఆ ప్రాంతం నుండి దూరంగా తీసుకెళ్లండి. ఒకవేళ పాము ఇంటి గదిలో ఉంటే, మీకు ఆ గదికి మధ్య ఉన్న తలుపులను గట్టిగా మూసివేయండి.

సొంత ప్రయోగాలు వద్దు: చిన్న పాము కదా అని దాన్ని మీరే సొంతంగా చంపడానికి, పట్టుకోవడానికి లేదా కదిలించడానికి ప్రయత్నించకండి. చాలావరకు పాము కాట్లు ఇలాంటి అనుభవం లేని సాహసాల వల్లే జరుగుతాయి.

కర్రలు, రసాయనాలు వాడొద్దు: పామును బయటకు తోలడానికి కర్రలు, చీపుర్లు వాడటం వల్ల అది బెదిరింపుగా భావించి ఎదురుదాడికి దిగుతుంది. అలాగే పాము బొరియల్లోకి ఫినైల్, కిరోసిన్ లాంటి రసాయనాలు పోయడం వల్ల అది దూరంగా వెళ్లే మాట దేవుడెరుగు.. తిరగాబడి మీ వైపుకే దూసుకువచ్చే ప్రమాదం ఉంది.

లొకేషన్ గమనించండి: పాము చివరిసారిగా ఎక్కడ కనిపించిందో గుర్తుంచుకోండి. ఎందుకంటే అక్కడ పాము పిల్ల కనిపించిందంటే సమీపంలోనే దాని గూడు ఉండే అవకాశం ఉంటుంది.

Follow Us
పాము పిల్ల గురించి ఈ నిజాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
పాము పిల్ల గురించి ఈ నిజాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
ఊహించని ట్విస్టులు.. మైండ్ బ్లాంక్ అయ్యే సస్పెన్స్.
ఊహించని ట్విస్టులు.. మైండ్ బ్లాంక్ అయ్యే సస్పెన్స్.
ఉద్యోగం పోతే ఎలా? నో టెన్షన్‌.. కుటుంబ ఖర్చుల కోసం 4 పనులు చేయండి
ఉద్యోగం పోతే ఎలా? నో టెన్షన్‌.. కుటుంబ ఖర్చుల కోసం 4 పనులు చేయండి
సంజూకే నా ఓటు.. వైభవ్ ఎంట్రీపై దినేష్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు
సంజూకే నా ఓటు.. వైభవ్ ఎంట్రీపై దినేష్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు
మొసలి వర్సెస్ నీటి కుక్కలు.. విజేత ఎవరు..?
మొసలి వర్సెస్ నీటి కుక్కలు.. విజేత ఎవరు..?
క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.. దంపతుల మృతి!
క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.. దంపతుల మృతి!
ఒక్క టీ20లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలవని దిగ్గజాలు వీరే
ఒక్క టీ20లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలవని దిగ్గజాలు వీరే
సినిమా స్టైల్‌లో దోపిడీ.. వ్యాపారిని నమ్మించి నట్టేట ముంచేశారు..
సినిమా స్టైల్‌లో దోపిడీ.. వ్యాపారిని నమ్మించి నట్టేట ముంచేశారు..
యువత కోసం సరికొత్త బైక్‌.. ఫుల్‌ ట్యాంకుతో 481 కి.మీ. మైలేజ్..
యువత కోసం సరికొత్త బైక్‌.. ఫుల్‌ ట్యాంకుతో 481 కి.మీ. మైలేజ్..
పారేసిన ప్లాస్టిక్‌తో ఇంత అందమా? వరంగల్ అందరినీ ఆకట్టుకుంటోంది!
పారేసిన ప్లాస్టిక్‌తో ఇంత అందమా? వరంగల్ అందరినీ ఆకట్టుకుంటోంది!