AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరణాన్ని ముద్దాడే మగ తేనెటీగ.. రాణి కోసం ప్రాణత్యాగం.. ఈ ప్రకృతి కథ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

చనిపోతానని తెలిసి కూడా, కేవలం తన భవిష్యత్తు తరాల మనుగడ కోసం ప్రాణాలను పణంగా పెట్టే ఒక అమర ప్రేమికుడి కథ ఇది. తేనెటీగల సామ్రాజ్యంలో ఆడవాళ్లదే పైచేయి అనుకుంటాం కానీ.. రాబోయే తరం కోసం మగ ఈగ చేసే ఈ ప్రాణ త్యాగం గురించి తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే.. ఆ అద్భుతమైన ప్రకృతి వింత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మరణాన్ని ముద్దాడే మగ తేనెటీగ.. రాణి కోసం ప్రాణత్యాగం.. ఈ ప్రకృతి కథ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Why Do Drone Bees Die After Mating
Krishna S
|

Updated on: Jul 03, 2026 | 10:21 AM

Share

ప్రకృతి సృష్టిలో ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. అందులో తేనెటీగల సామ్రాజ్యం ఒక అద్భుతమైన క్రమశిక్షణకు, వ్యవస్థీకృత జీవన శైలికి మారుపేరు. సాధారణంగా తేనె తుట్టె అనగానే మనకు రాణి ఈగ, రాత్రింబవళ్లు కష్టపడే కూలి ఈగలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ ఈ సామ్రాజ్యం వెనుక మగ ఈగలు, అంటే డ్రోన్ బీస్ చేసే ప్రాణ త్యాగం గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. తమ భవిష్యత్తు తరాల కోసం ప్రాణాలను అర్పించే ఈ డ్రోన్ బీస్ కథ నిజంగా ఒక అద్భుతం.

డ్రోన్ బీ అంటే ఎవరు? వీటిని ఎలా గుర్తించాలి?

ఈ రోజుల్లో డ్రోన్ అనగానే అందరికీ ఆకాశంలో ఎగిరే కెమెరా గ్యాడ్జెట్ గుర్తుకు వస్తుంది. కానీ, తేనెటీగల ప్రపంచంలో అసలైన డ్రోన్ అంటే మగ ఈగ. పరిమాణం పరంగా చూస్తే, ఇవి కూలి ఈగల కంటే కాస్త లావుగా, పెద్ద కళ్లతో ఉంటాయి. అందుకే వీటిని తేనె తుట్టెలో చాలా సులభంగా గుర్తించవచ్చు. అయితే వీటికి కూలి ఈగలకు ఉన్నట్లుగా శత్రువులను కుట్టేందుకు వీలైన స్టింగ్ లేదా ముల్లు ఉండదు.

సామ్రాజ్యంలో లగ్జరీ లైఫ్.. ఎందుకోసం?

తేనెటీగల ప్రపంచంలో ఆడవాళ్లదే పైచేయి అయినప్పటికీ, మగ ఈగలను మాత్రం ఎంతో రాజభోగాలతో చూసుకుంటారు. ఈ డ్రోన్ బీస్ తుట్టెలో ఎలాంటి పనులూ చేయవు. కేవలం తిని కూర్చోవడం మాత్రమే వీటి పని. వీటికి కావలసిన ఆహారం, నీరు వంటివన్నీ వర్కర్ బీసే స్వయంగా తెచ్చి నోటికి అందిస్తాయి. దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. భవిష్యత్తులో క్వీన్ బీతో జరిగే మేటింగ్ కోసం ఈ డ్రోన్ బీస్ ఎంతో ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలి. అందుకోసమే కూలి ఈగలు వీటికి అంతటి రాచమర్యాదలు చేస్తాయి.

ఆకాశ వీధిలో పెళ్లి.. గాలిలోనే ప్రాణత్యాగం..

డ్రోన్ బీస్ జీవితంలో అత్యంత కీలకమైన, చివరి ఘట్టం క్వీన్ బీతో జరిగే మేటింగ్ ప్రక్రియ. ఈ ప్రక్రియ జరిగే విధానం అత్యంత విచిత్రంగా ఉంటుంది. మనుషుల పెళ్లిళ్లకు ముహూర్తాలు చూసినట్లుగా, వర్కర్ బీస్ అన్నీ కలిసి భూమికి, ఆకాశానికి మధ్యలో ఒక ప్రత్యేకమైన మేటింగ్ సమయాన్ని, వేదికను ఏర్పాటు చేస్తాయి. అక్కడికి క్వీన్ బీ, డ్రోన్ బీలను తీసుకువెళ్తాయి. క్వీన్ బీతో మేట్ అయితే తాము చనిపోతామని డ్రోన్ బీస్‌కు ముందే తెలుసు. అయినా సరే, రాబోయే తరాల మనుగడ కోసం అవి వెనకడుగు వేయవు. మేటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే, ఆ శారీరక మార్పుల తీవ్రతకు తట్టుకోలేక డ్రోన్ బీ అక్కడికక్కడే, గాలిలోనే ప్రాణాలు విడిచి కిందపడిపోతుంది. ఒకే ఒక్కసారి మేటింగ్.. ఆ తర్వాత జీవితం ముగిసిపోతుంది.

పుట్టుకను శాసించేది వర్కర్ బీసే..

తేనెటీగల సామ్రాజ్యంలో మరో నమ్మశక్యం కాని నిజం ఏమిటంటే.. ఆ తుట్టెలో తదుపరి తరం ఎలా ఉండాలనేది పూర్తిగా వర్కర్ బీస్ చేతుల్లోనే ఉంటుంది. కొత్తగా క్వీన్ బీ పుట్టాలా, వర్కర్ బీస్ పుట్టాలా లేక డ్రోన్ బీస్ పుట్టాలా అనే లార్వా ఎంపికను, వాటి పెరుగుదలను కూలి ఈగలే నియంత్రిస్తాయి. జాతి మనుగడ కోసం, సరికొత్త తరం కోసం ప్రాణాలర్పించే డ్రోన్ బీస్ కథ వింటుంటే ప్రకృతి సృష్టి ఎంత క్రూరమైనదో, అంతకంటే ఎక్కువ అద్భుతమైనదని అర్థమవుతుంది. ఒకే ఒక్క క్షణం కోసం ప్రాణాలను త్యాగం చేసే ఈ మగ ఈగలు, తేనెటీగల సామ్రాజ్యంలో నిజమైన త్యాగధనులు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Follow Us