WhatsApp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్ ‘ఒక్కసారి మాత్రమే’.. మీరూ ట్రై చేయండి

Javeed Basha Tappal

Javeed Basha Tappal |

Updated on: Aug 04, 2021 | 9:09 AM

మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్‌ను యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యూవ్ వన్స్ పేరిట ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌ను ఉపయోగించి..

WhatsApp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్ 'ఒక్కసారి మాత్రమే'.. మీరూ ట్రై చేయండి
Whatsapp New Feature

Follow us on

మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్‌ను యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యూవ్ వన్స్ పేరిట ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌ను ఉపయోగించి మనం పంపే ఫోటోలు, వీడియోలను ఇతరులు ఒక్కసారి మాత్రమే చూసే వీలుంటుంది. అలాగే మనం ఇతరులకు పంపే ఫోటోలు, వీడియోలు వారి లైబ్రరీలో స్టోర్ అయ్యే అవకాశం లేదు. అంతేకాకుండా వ్యూ వన్స్ ఫీచర్‌తో మనం పంపే సందేశాలు ఇతరులు ఫార్వడ్, సేవ్, స్టార్, షేర్ చేయలేరు. వాట్సాప్ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించి పంపే ఫోటో, వీడియోలను 14 రోజుల్లోపు ఓపెన్ చేయకపోతే ఆ మీడియా చాట్‌ కనుమరుగవుతుంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించాలనుకునే వారు ఇతరులకు ఫోటోలు, వీడియోలు పంపే ముందు ప్రతిసారి తప్పనిసరిగా వ్యూ వన్స్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త ఫీచర్‌ను యూజర్స్ తమకు నమ్మకమైన వారికి ఫోటోలు, వీడియోలు పంపేటప్పుడు ఉపయోగిస్తే మంచిదని వాట్సాప్ సూచించింది. ఎందుకంటే ఇతరులు స్క్రీన్ షాట్ తీసుకోకుండా జాగ్రత్తలు వహించవచ్చని సూచించింది.

Read this also: Twitter: తప్పుడు సమాచారం కట్టడికి ట్విటర్ కొత్త చర్యలు.. ఆ రెండు సంస్థలతో ఒప్పందాలు

SBI yono Features: సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టేందుకు ఎస్‌బీఐ మరో ముందడుగు.. యోనో యాప్‌లో కొత్త ఫీచర్‌..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu