AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గుడి ముందు పడుకున్న వ్యక్తి.. పాకుతూ వచ్చి తల కిందకు దూరిన పాము.. కట్ చేస్తే..

పాములు సహజంగా మనుషుల్ని చూస్తే అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నిస్తాయి. కానీ ఈ పాము మాత్రం చెట్టు కింద నిద్రిస్తున్న వ్యక్తి తల కింద నుంచి దూసుకెళ్లింది. అందుకు సంబంధించిన వీడియో మరోసారి నెట్టింట తెగ సర్కులేట్ అవుతోంది.

Viral Video: గుడి ముందు పడుకున్న వ్యక్తి.. పాకుతూ వచ్చి తల కిందకు దూరిన పాము.. కట్ చేస్తే..
Snake
Ram Naramaneni
|

Updated on: Oct 16, 2024 | 7:01 PM

Share

పాములతో పరేషాన్ మాములుగా ఉండదు. అవి ఎప్పుడు.. ఎటు వైపు నుంచి వస్తాయో తెలీదు. ఆహారాన్ని వేటాడుతూ అవి జనావాసాల్లోకి  ఎప్పుడు ఎటు వైపు నుంచి వస్తాయో కూడా చెప్పలేం. కొన్నిసార్లు నట్టింట్లో నక్కి.. భయబ్రాంతులకు గురిచేస్తాయి. బీరువాల కింద.. షూలలో.. చెట్ల పొదల్లో లాంటి మరుగు ప్రాంతాల్లో తిష్ఠ వేసి.. అలికిడి వినిపించగానే అటాక్ చేస్తాయి. అందుకే అప్రమత్తత అవసరం. ఇక పాములకు సంబంధించిన వీడియోలు నిత్యం నెట్టింట చక్కర్ల కొడుతూనే ఉంటాయి. అలాంటి ఓ వైరల్ వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాం.. .ఓ వ్యక్తి గుడి ముందు పడుకుని ఉండగా.. ఓ పాము అతడి తల కిందకు దూరింది. చివరకు ఏమైందో చూసేద్దాం పదండి…

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో కేరళకు చెందినదిగా తెలిసింది. అక్కడి కొడంగల్లూర్‌లోని శ్రీకురుంబ భగవతి టెంపుల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి గుడి ఎదురుగా ఉన్న చెట్టు కింద సేద తీరుతున్నాడు. అతను గాఢ నిద్రలో ఉండగా ఓ పాము అక్కడికి వచ్చింది. అతడు పడుకున్న అరుగు పైకి ఎక్కి.. అతడి తల కింద నుంచి పాకుతూ వెళ్లింది. పాము తాకగానే ఉలిక్కిపడి పైకి లేచి కంగుతిన్నాడు. తీరా పామును చూసి భయంతో పైకి లేచి పక్కకు పరుగులు తీశాడు. అయితే పాము మాత్రం అతడికి ఎలాంటి హానీ అక్కడి నుంచి వెళ్లిపోయింది. చివరకు ఓ చెట్టు కింద ఉన్న దేవుడి ఫొటోల వద్దకు వెళ్లి ఆగింది. జూన్ మాసంలో బయటకు వచ్చిన, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. అది జెర్రిగొడ్డు అని.. అది ప్రమాదకరం కాదని ఓ వ్యక్తి వ్యాఖ్యానించాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us