AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అరశినగుండి జలపాతంలో కొట్టుకుపోయిన యువకుడు.. షాకింగ్‌ వీడియో వైరల్‌..

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, కొల్లూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడు భద్రావతికి చెందిన శరత్‌కుమార్‌గా గుర్తించామని, ఘటన జరిగినప్పుడు అతడు బండరాయి అంచున నిలబడి ఉన్నాడని తెలిపారు.

Watch: అరశినగుండి జలపాతంలో కొట్టుకుపోయిన యువకుడు.. షాకింగ్‌ వీడియో వైరల్‌..
Youth Washed Away
Jyothi Gadda
|

Updated on: Jul 24, 2023 | 4:54 PM

Share

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చాయి. రుతుపవనాల ప్రభావంతో అన్ని రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటకలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న, ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షంతో చెరువులు, వాగులు, నదిపరివాహక ప్రాంతాల్లో వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం బైందూరు తాలూకాలోని కొల్లూరు సమీపంలోని అరశినగుండి జలపాతాన్ని వీక్షిస్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, కొల్లూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడు భద్రావతికి చెందిన శరత్‌కుమార్‌గా గుర్తించామని, ఘటన జరిగినప్పుడు అతడు బండరాయి అంచున నిలబడి ఉన్నాడని తెలిపారు.

కాగా, యువకుడు బండరాయిపై నిలబడి నీటి ప్రవహ దృశ్యాలను చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియోలు యువకుడు అప్పటి వరకు బండరాయిపై నిలబడి ఉన్నాడు. ఉప్పొంగి ప్రవహిస్తున్న నీటిని చూస్తూ ఆనందపడుతున్నాడు. అలా చూస్తుండగానే అనుకోని ఘటన చోటు చేసుకుంది. ఊహించని విధంగా అతడు ఒక్కసారిగా జారి నీళ్లలో పడి కొట్టుకుపోయాడు.

పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో సుబ్రహ్మణ్యం సమీపంలోని హైవే జలమయమైంది. చాలా మంది కళాశాల విద్యార్థులు తమ సెమిస్టర్ పరీక్షలు రాయడానికి కాలేజీకి హాజరయ్యేందుకు వరదల కారణంగా రోడ్డు దాటలేకపోయారు. ఈ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా అనేక మంది విద్యార్థులు మంగళూరు యూనివర్సిటీ పరీక్షలను వాయిదా వేయాలని కోరారు.

ఇవి కూడా చదవండి

పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో, నేత్రావతి నది నీటిమట్టం బంట్వాళలో 7.9 మీటర్లకు చేరుకుంది. కొన్ని ప్రాంతాలు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..