Kitchen tips: పెరుగుతున్న ధరలు.. అల్లం చెడిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..
అసలే ఇది వర్షాకాలం.. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు వెంటాడుతుంటాయి. ఇలాంటి టైమ్‌లో ప్రతి ఇంట్లో అల్లం,మిరియాలు వంటి వాడకం ఎక్కువగా ఉంటుంది. అయితే, అల్లం ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఇంచికి తెచ్చినప్పుడు ఎలా నిల్వ చేయాలో చాలా మందికి తెలియదు.. ఈ సింపుల్ టిప్స్ పాటించి మీరు అల్లం ఎక్కువ రోజులు తాజాగా, ఉండేలా నిల్వచేసుకోవచ్చు..
Updated on: Jul 24, 2023 | 6:59 PM

అల్లం తెచ్చిన వెంటనే తొక్క తీసి గాలి చొరబడని డబ్బాలో పెట్టండి. లేదా జిప్ బ్యాగ్ లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచినట్టయితే, ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు. పొట్టు తీసిన అల్లంను చిన్న ముక్కలుగా కట్ చేసి గాలి చొరబడని డబ్బాలో డీప్‌గా ఫ్రీజ్ చేయండి. ఇది చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది.

ఒలిచిన అల్లంను చిన్న ముక్కలుగా కట్ చేసి, గాలి చొరబడని డబ్బాలో పెట్టి డీప్ ఫ్రీజ్ చేయండి. ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. అల్లంను జిప్ బ్యాగ్‌లో ఉంచి గాలి, నీరు బయటకు రాకుండా ఉంచితే దాదాపు ఒక నెల పాటు ఉపయోగించవచ్చు.

అల్లం తొక్క తీసి, ఆపై ఆమ్ల ద్రవం ఉన్న కూజాలో ఉంచండి. మీరు కావాలనుకుంటే దానిని వెనిగర్ లేదా నిమ్మరసం వేసి భద్రపరచవచ్చు. ఇది చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది.

ఇంకో సులువైన పద్దతి ఏమిటంటే నీరు కలపకుండా అల్లం ముద్దలా చేసి ఫ్రిజ్‌లో గాలి చొరబడని డబ్బాలో ఉంచాలి. ఇది సులభంగా వంట చేయడంలో సహాయపడుతుంది.

అల్లం పేపర్‌లో చుట్టి భద్రపరిస్తే.. వారం రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. అల్లం కోయకుండా, పొట్టు తీయకుండా చాలా కాలం పాటు ఉపయోగించవచ్చు. తొక్క తీసినట్టయితే త్వరగా పాడైపోతుంది.

ఈ సింపుల్ టిప్స్ పాటించి మీరు అల్లం ఎక్కువ రోజులు తాజాగా, ఉండేలా నిల్వచేసుకోవచ్చు..




