AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఆకలి తట్టుకోలేక బతికున్న పురుగులు తింటున్న చిన్నారులు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో!

ఉగాండాలో తీవ్రమైన ఆహార కొరత ప్రపంచాన్ని కలవర పెడుతుంది. కనీసం కడుపు నిండా తిండిలేక ఇక్కడి పిల్లలు, పెద్దలు బక్కపలచగా, ఎముకల గూడు మాదిరి కనిపిస్తున్నారు. ఉగాండా ప్రజల ఆకలి కేకలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ దేశంలోని కరమోజా సబ్ రీజన్‌లోని

Watch Video: ఆకలి తట్టుకోలేక బతికున్న పురుగులు తింటున్న చిన్నారులు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో!
Children In Uganda Eating Raw Termites
Srilakshmi C
|

Updated on: Nov 11, 2025 | 9:19 PM

Share

ఆఫ్రికా ఖండంలోని చాలా దేశాల పరిస్థితి అతి దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా ఉగాండాలో తీవ్రమైన ఆహార కొరత ప్రపంచాన్ని కలవర పెడుతుంది. కనీసం కడుపు నిండా తిండిలేక ఇక్కడి పిల్లలు, పెద్దలు బక్కపలచగా, ఎముకల గూడు మాదిరి కనిపిస్తున్నారు. ఉగాండా ప్రజల ఆకలి కేకలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ దేశంలోని కరమోజా సబ్ రీజన్‌లోని ప్రజలు ఆహార కొరతతో అల్లాడిపోతున్నారు. దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడి పిల్లలు ఆకలి తట్టుకోలేక బతికున్న పురుగులు తింటున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఆఫ్రికన్ దేశమైన ఉగాండాలోని ప్రజలు కరువుతో అల్లాడిపోతున్నారు. తినడానికి పిడికెడు ఆహారంలేక ప్రతీ రోజూ నరకం చూస్తున్నారు. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు నిత్యం ఎందరో ఆకలితో మృత్యువాత పడుతున్నారు. ఇక్కడి ప్రజలు ప్రాణాలు నిలుపుకోవడానికి మట్టి, గడ్డిని సైతం తింటున్నారు. తాజాగా ఓ ఇద్దరు చిన్నారులు ఆకలి బాధలు తాళలేక బతికున్న పురుగులను తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు పిల్లలు తమకు ఎదురుగా ప్లేట్‌లలో ఉన్న బతికున్న పరుగులను నోట్లో వేసుకుని కడుపు నింపుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో అక్కడి ఆకలి బాధను చిత్రీకరిస్తుంది. ఈ వీడియో చూసిన వారు కంటతడి పెట్టుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే ఈ చిన్నారులు తింటున్న పరుగుల్లో అధిక ప్రొటీన్‌ ఉంటుందని, ఇవి మాంసం కంటే ఎక్కువ పోషకమైనవని నిపుణులు అంటున్నారు. అయితే సాధారణంగా వీటిని మంటపై వేయించుకుని తింటూ ఉంటారు. కానీ ఉగాండాలో తీవ్రమైన ఆహార కొరత కారణంగా ఇలా పురుగులు బ్రతికుండగానే తినటం చూస్తుంటే ప్రతి ఒక్కరి మనసు మెలిపెడుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘దేవుడు వారికి సహాయం చేయునుగాక’ అని హృదయపూర్వకంగా వేడుకుంటున్నారు. ధనవంతులు ఈ వీడియో చూసి వారి ఆకలి తీర్చాలని కోరుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.