అయ్యో పాపం పాము..! ఎరక్కపోయి ఫ్యాన్ రెక్కల్లో ఇరుక్కుపోయింది..వీడియో చూసి నెటిజన్లు ఫైర్..
ఎండ వేడిని తట్టుకోలేక.. సరీసృపాలు తమ ఆవాసాలను విడిచిపెట్టి.. జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. అయితే ఇలా రావడం వల్ల.. అటు మనుషులకు.. ఇటు సరీసృపాలకు..

ఎండ వేడిని తట్టుకోలేక.. సరీసృపాలు తమ ఆవాసాలను విడిచిపెట్టి.. జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. అయితే ఇలా రావడం వల్ల.. అటు మనుషులకు.. ఇటు సరీసృపాలకు ఊహించని ప్రమాదాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మరి అదేంటో ఓసారి చూసేద్దాం..
వైరల్ వీడియో ప్రకారం.. ఓ పాము ఎండవేడిని తట్టుకోలేక ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఎలా చేరుకుందో.. ఏమో తెలియదు గానీ.. సరాసరి సీలింగ్ ఫ్యాన్ పైకి చేరుకొని దాని రాడ్‌ను చుట్టుకుంటుంది. ఇంతలో ఆ ఫ్యాన్ తిరగడం మొదలైంది. అక్కడ నుంచి ఎలా బయటపడాలో తెలియక.. అన్ని దిక్కులలోనూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంది. అయితే తల ప్రతీసారి ఫ్యాన్ రెక్కకు తగులుతుంది. కానీ ఆ పాము ఫైనల్ అటెంప్ట్ చేద్దామనుకున్నట్లుంది.. చివరిగా ధైర్యం చేసి దిగుదాం అని చూస్తుంది. తల రెక్కలకు తగిలి.. దాన్ని వీడియో తీసే వ్యక్తిపై పడుతుంది. కాగా, ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుండగా.. దీన్ని చూసి నెటిజన్లు.. వీడియో తీసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాపం.! ఆ పామును వీడియో తీయకుండా.. కాపాడొచ్చు కదా అని తిట్టిపోస్తున్నారు.
View this post on Instagram
