బుల్లెట్ బండ్లు నడుపుతూ ఫంక్షన్ హాల్‌కు వధూవరులు
గతంలో ఓ నవవధువు పెళ్లి వేడుక తర్వాత బుల్లెట్ బండి పాటకు డాన్స్ చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ ఇక్కడ నూతన వధూవరులిద్దరూ చెరో బుల్లెట్ రైడ్ చేస్తూ ఆకట్టుకున్నారు. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన పెండ్యాల రామకృష్ణార్జునరావు..
గతంలో ఓ నవవధువు పెళ్లి వేడుక తర్వాత బుల్లెట్ బండి పాటకు డాన్స్ చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ ఇక్కడ నూతన వధూవరులిద్దరూ చెరో బుల్లెట్ రైడ్ చేస్తూ ఆకట్టుకున్నారు. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన పెండ్యాల రామకృష్ణార్జునరావు ప్రమీల దంపతుల కుమారుడు రవితేజకు ఏపీలోని లక్కవరానికి చెందిన డాక్టర్ సింధు హిమానీతో ఈ నెల 7న వివాహం జరిగింది. వీరి రిసెప్షన్ పాల్వంచలో జరుగగా.. కొత్త దంపతులు చెరొక బుల్లెట్ నడుపుతూ వరుడి ఇంటి నుండి ఫంక్షన్ హాల్ కు వచ్చారు. ముందూ, వెనుక బంధువులు, స్నేహితులు వాహనాలపై వస్తూ పూలు చల్లుతుండగా స్థానికులు ఆసక్తిగా తిలకించారు. స్కూటీ నడపడం అలవాటు ఉందని మామయ్య ఆలోచన మేరకు బుల్లెట్ బండి నడిపానని నవ వధువు అంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బల్బులు మార్చితే చాలు.. కోట్ల జీతం మీదే..
మా ఆవిడ నన్ను కొట్టింది.. జపాన్ రాయబారి ట్వీట్.. మోదీ రియాక్షన్
అయ్యయ్యో.. టైమ్ బ్యాడ్ అయితే ఇలాగే ఉంటుంది.. కారు నుంచి సేఫ్ అయినా.. కుక్క వదల్లేదు..
బోటులో ఎగిసిపడ్డ మంటలు.. డాల్ఫిన్స్ కోసం వెళితే ఊహించని ప్రమాదం
సైకిల్ పై పడుకొని స్టంట్ చేశాడు.. చివరికి ??