AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఈ చిన్న పురుగులు బంగారం కంటే విలువైనవి.. కిలో ఎంతో తెలిస్తే ఖంగుతింటారు.!

పైన పేర్కొన్న ఫోటోలో పసుపు కొమ్ముల్లా కనిపిస్తున్నవి.. గొంగళి పురుగులు. ఇవి బంగారం కంటే విలువైనవి. చాలా అరుదుగా దొరుకుతాయి. ఆ గొంగళి పురుగుల కిలో వందో, వెయ్యో ఉండదు గురూ..

Viral: ఈ చిన్న పురుగులు బంగారం కంటే విలువైనవి.. కిలో ఎంతో తెలిస్తే ఖంగుతింటారు.!
Himalayan Viagra
Ravi Kiran
|

Updated on: Jun 17, 2023 | 10:33 AM

Share

పైన పేర్కొన్న ఫోటోలో పసుపు కొమ్ముల్లా కనిపిస్తున్నవి.. గొంగళి పురుగులు. ఇవి బంగారం కంటే విలువైనవి. చాలా అరుదుగా దొరుకుతాయి. ఆ గొంగళి పురుగుల కిలో వందో, వెయ్యో ఉండదు గురూ.. ఏకంగా రూ. 70 లక్షలు ఉంటుంది. అలాగే ఒక గ్రాము రూ. 7 వేలు వరకు పలుకుతుంది. ఇదేంటి గొంగళి పురుగులు చూపించి.. గోల్డ్ కంటే విలువైనవి అని అంటున్నానని అనుకోవద్దు. వాటినే హిమాలయన్ వయాగ్రా అని పిలుస్తారు. ఇది ఎందుకు పని చేస్తుందో.. మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనుషుల్లో లైంగిక సమస్యలకు ఇది దివ్యఔషధం అని అంటుంటారు. ఈ హిమాలయన్ వయాగ్రాకు చైనా, జపాన్, కొరియా లాంటి దేశాల్లో భారీ గిరాకీ ఉంది.

హిమాలయాలపై సుమారు 3 వేల అడుగుల ఎత్తులో ఈ గొంగళి పురుగులు ఓ అరుదైన ఫంగస్ వల్ల చనిపోయి.. ఆ తర్వాత ఎండిపోతాయి. అలా అయిన వాటిని హిమాలయన్ వయాగ్రా అని పిలుస్తారు. మే, జూన్ నెలల్లో దేశ విదేశాల నుంచి చాలామంది ఈ పురుగుల కోసం హిమాలయ పర్వతాలున్న ప్రదేశాలకు వస్తారు. కొన్నిసార్లయితే.. ఈ పురుగుల దొరకాలంటే.. ప్రాణాలను కూడా లెక్కచేయకుండా హిమాలయ పర్వతాలు ఎక్కాల్సి ఉంటుంది. ఈ పురుగులను అక్కడ నివసించే స్థానికులు, విదేశీయులు ఎక్కువగా సేకరిస్తారు. అంతేకాకుండా దీన్నే ఆదాయ వనరుగా మార్చుకుంటారు కొందరు.

కాగా, ఈ పురుగులు దొరికినప్పుడు.. వీటిని అమ్మేందుకు సరైన కొనుగోలుదారులను కూడా మనమే ముందు చూసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ పురుగులు ఎక్కువగా దొరకట్లేదు. అంతేకాకుండా వీటి జాతి కూడా క్రమేపీ అంతరించిపోతోంది. ఈ క్రమంలోనే వీటి ధర కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ పురుగులను లైంగిక సామర్ధ్యాన్ని పెంచేందుకు మాత్రమే కాదు.. క్యాన్సర్, డయాబెటిస్ లాంటి రోగాలు తగ్గేందుకు కూడా వినియోగిస్తారు.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!