Father’s Love: మనసును తడిపే వీడియో.. ఈ పేద తండ్రి ఆనందం ముందు ఆకాశం కూడా చిన్నదే
ఉన్నవాడు లేనివాడు అంటూ తారతమ్యాలు చూడవు ఎమోషన్స్.. అయితే కన్నవాళ్లు పిల్లలకు ఇచ్చే ప్రేమ చాలా గొప్పది. తాము కష్టపడైనా పిల్లలు సుఖంగా ఉండాలని కోరుకుంటారు.
ఆనందం.. చాలామంది దీనికోసం ఎక్కడెక్కడో వెతుకుంటారు. కొంతమంది డబ్బులో ఆనందం దొరుకుతుంది.. చాలా మందికి ఉన్న దాంట్లోనే దాన్ని ఆస్వాదిస్తారు. ఎమోషన్స్ అనేవి దేనిని ఆశించవు..వాటికీ ఎవరైనా ఒకటే.. ఉన్నవాడు లేనివాడు అంటూ తారతమ్యాలు చూడవు ఎమోషన్స్.. అయితే కన్నవాళ్లు పిల్లలకు ఇచ్చే ప్రేమ చాలా గొప్పది. తాము కష్టపడైనా పిల్లలు సుఖంగా ఉండాలని కోరుకుంటారు. పిల్లల ఆనందమే తమ ఆనందంగా ఆస్తిగా భవిస్తూ ఉంటారు. . చాలా మంది తమ కూతురితో అమ్మను చూసుకుంటారు. కూతుర్ని ఎంతో గారాబంగా చూసుకుంటూ ఉంటారు నాన్నలు. తాజాగా అలాంటి హృదయాన్ని కదిలించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈవీడియో నెటిజన్ల గుండెను తడుపుతుంది.
ఈ వైరల్ వీడియో ఎవరు తీశారు ఎక్కడ తీశారో తెలియదు కానీ దాన్ని చూస్తే కళ్ళు చమార్చకుండా ఉండవు. ఈ వీడియో ఓ నాన్న తన కూతురిని ఆడిస్తూ కనిపించాడు.. ఆ చిన్నారి నవ్వుతుంటే కష్టాన్ని మరిచిపోయి చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఇందులో ఏముంది అనుకుంటున్నారా..? ఆ తండ్రికి కాళ్ళు లేవు. రోజంతా ఉరుకుల పరుగుల నగరంలో చక్రాల బండి పై కష్టాలు పడే ఆ తండ్రి తన కూతుర్ని ఆడిస్తూ కనిపించాడు. తండ్రి చక్రాల బండి పై కళ్ళు పెట్టి ఆ చిన్నారి నిలబడగా ఆ బండిని ముందుకు వెనక్కు నెడుతూ ఆ పాపను ఆడిస్తూ ఆనంద పడ్డాడు ఆ పేద తండ్రి.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి