కోడిపుంజు రోజూ కూస్తోందని.. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వైద్యుడు.. అసలేమైందంటే..?

గ్రామాల్లో ఇప్పటికీ చాలామంది కోడి పుంజు కూతతోనే నిద్ర నుంచి మేల్కోంటారు. అందుకే కోడి కూతను అలారంగా పేర్కొంటారు. కోడిపుంజు కూత తర్వాత నిద్ర నుంచి మేల్కొని తమ దినచర్యను ప్రారంభిస్తారు.

కోడిపుంజు రోజూ కూస్తోందని.. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వైద్యుడు.. అసలేమైందంటే..?
Chicken
Follow us

|

Updated on: Nov 29, 2022 | 3:27 PM

Troubled By The Crowing Of A Chicken: గ్రామాల్లో ఇప్పటికీ చాలామంది కోడి పుంజు కూతతోనే నిద్ర నుంచి మేల్కోంటారు. అందుకే కోడి కూతను అలారంగా పేర్కొంటారు. కోడిపుంజు కూత తర్వాత నిద్ర నుంచి మేల్కొని తమ దినచర్యను ప్రారంభిస్తారు. అయితే, అలాంటి కోడిపుంజు ఉదయాన్నే కూసి.. తన నిద్రకు భంగం కలిగించిందని ఓ డాక్టర్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ పట్టణంలో చోటుచేసుకుంది. ఇండోర్‌కు చెందిన ఓ క్యాన్సర్ నిపుణుడు తన ఇంటిపక్కనున్న కొడి ఇబ్బంది పెడుతుందంటూ.. పొరుగింటి వారిపై పలాసియా పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. అలోక్‌ మోడీ అనే క్యాన్సర్‌ నిపుణుడు పాలసియా ప్రాంతంలోని గ్రేటర్‌ కైలాష్‌ ఆసుపత్రి సమీపంలోని సిల్వర్‌ ఎన్‌క్లేవ్స్‌లో నివాసం ఉంటున్నాడు. రోజంతా ఆసుపత్రి డ్యూటీ, ఆపరేషన్ల కారణంగా అర్ధరాత్రి సమయంలో ఇంటికి వచ్చి నిద్రపోతుంటానని.. ఉదయం వరకు నిద్రలేవనని పోలీసులకు తెలిపాడు. ఈ సమయంలో తన ఇంటి సమీపంలో ఉన్న వందన విజయన్‌ అనే వ్యక్తికి చెందిన ఓ కోడి మాత్రం రోజూ తెల్లవారుజామునే కూస్తూ నిద్రకు భంగం కలిగిస్తుందని వివరించాడు.

ఈ విషయం గురించి విజయన్‌తో పలుమార్లు చర్చలు జరిపానని.. కోడిని బోనులో ఉంచమని సలహా కూడా ఇచ్చినట్లు తెలిపాడు. వారు పట్టించుకోకపోవడం.. కోడి తరచూ అరుస్తుండటంతో విసుగుచెంది పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు వెల్లడించాడు. కోడి కూస్తూ.. తన నిద్రకు భంగం కలిగిస్తోందని.. దీనికి కారణం పొరుగింటివారేనంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. రోజంతా ఆసుపత్రిలో పని చేసి అలసిపోయి ఇంటికొస్తున్నాని.. విజయన్‌కు కోడి రోజూ తెల్లవారుజామున 4-5 గంటల మధ్య కూస్తూ తన నిద్రకు భంగం కలిగిస్తోందన్నాడు.

కోడితోపాటు.. నాలుగు కుక్కలు కూడా మొరుగుతూ.. ఇబ్బందిపెడుతున్నాయని ఫిర్యాదులో తెలిపాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వందన విజయన్‌పై సెక్షన్‌ 138 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పలాసియా పోలీస్ స్టేషన్‌ అధికారి సంజయ్ బాయిస్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..