AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vasuki: ఇది పురాణాల్లో చెప్పిన వాసుకి జాతి పామా..? ఎన్ని అడుగులు ఉందంటే..?

ప్రపంచంలో ఇప్పటివరకూ వెలుగుచూసిన పాముల్లో అత్యంత పొడవైన పాము శిలాజం ఇదే. ఈ పాము జాతికి ‘వాసుకి ఇండికస్’ అనే పేరు పెట్టారు. పురాణాలను పరిశీలిస్తే, ఈ పేరును శివుడితో సంబంధమున్న పాము గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తుంటారు. 2022 వరకూ ల్యాబ్‌లోనే ఈ శిలాజాలు అలా ఉండిపోయాయి. ఆ తర్వాత పరిశోధన కొనసాగించడంతో ఆసక్తికర వివరాలు వెలుగుచూశాయి.

Vasuki: ఇది పురాణాల్లో చెప్పిన వాసుకి జాతి పామా..? ఎన్ని అడుగులు ఉందంటే..?
Snake Fossils
Ram Naramaneni
|

Updated on: Feb 27, 2025 | 3:25 PM

Share

హిందూ పురాణాల ప్రకారం.. వాసుకి శివుని మెడను అలంకరించిన శక్తివంతమైన సర్ప రాజుగా చెబుతుంటారు. ఈ పాముకు ఎన్నో దైవిక శక్తులు ఉన్నాయన్నది హిందువుల విశ్వాసం. అయితే ఆశ్చర్యకరంగా, లక్షలాది సంవత్సరాల క్రితం భూమిపై సంచరించిన శక్తివంతమైన పురాతన సర్పం  శిలాజాలను ఒక పరిశోధన కనుగొనడం చర్చనీయాంశమైంది. ఈ భారీ సర్ప జాతి శిలాజాలకు శివుడి కంఠాభరణ సర్పమైన వాసుకి పేరు మీదుగా ‘వాసుకి ఇండికస్’ అని  పెట్టారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఈ పాములు సుమారు 47 మిలియన్ సంవత్సరాల క్రితం ఇప్పుడు భారతదేశంలో నివసించాయని అంచనా. ఇవి 36 నుండి 50 అడుగుల పొడవు ఉండి ఉంటాయని చెబుతున్నారు. ఈ అంతరించిపోయిన జాతి ఇప్పటివరకు ఉన్న అతిపెద్ద పాములలో ఒకటి కావచ్చట. సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ పరిశోధనలు ఈ పురాతన సర్ప పరిమాణం, జీవనశైలి గురించి ఆసక్తికర విషయాలను తెలియజేశాయి.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ (IIT-రూర్కీ) పరిశోధకుల బృందం 2005లో గుజరాత్‌లోని కచ్‌లో పంధారో బొగ్గు గనిలో మొదట కనుగొనబడిన 27 శిలాజ వెన్నుపూసలపై అధ్యయనం చేసింది. మొదట్లో వాటిని మొసలి లాంటి సరీసృపాల శిలాజాలుగా భావించారు. లోతైన విశ్లేషణలో అవి పాముకు చెందినవని నిర్ధారించారు. వెన్నుపూస ఆకారం, నిర్మాణం మందపాటి, స్థూపాకార శరీరాన్ని కలిగి ఉందని చూపించింది. పూర్తి అస్థిపంజరం కనుగొనబడనప్పటికీ, పరిమాణ అంచనాల ప్రకారం ఈ జాతిని ఇప్పటివరకు తెలిసిన అతిపెద్ద పాములలో ఒకటిగా చెబుతున్నారు. 

ఈ పాముల పరిమాణం పెద్దగా ఉండటంతో.. అవి ఇతర జీవులను వేటాడొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రస్తుత కొండ చిలువలు, అనకొండల మాదిరిగానే ఇది ఎరను వేటాడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. పరిశోధనకు నేతృత్వం వహించిన వారిలో ఒకరైన దేబ్‌జీత్ మాట్లాడుతూ.. ఈ పాము మరీ అంత క్రూరంగా ఉండుండకపోవచ్చని కూడా అన్నారు. ఆనాటి ఉష్ణోగ్రతల వల్లే పాముకు అంత భారీ శరీర నిర్మానం ఉండిఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్