VIRAL VIDEO: వధువుకి గులాబ్ జామ్ తినిపించాలని ప్రయత్నించాడు..! పాపం అతడి వల్ల కాలేదు..

VIRAL VIDEO :పెళ్లిళ్లకు సంబంధించిన ఫన్నీ వీడియోలు ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్నింటిని చూస్తే ఆశ్చర్యంగా ఉంటాయి.

VIRAL VIDEO: వధువుకి గులాబ్ జామ్ తినిపించాలని ప్రయత్నించాడు..! పాపం అతడి వల్ల కాలేదు..
Viral Video
Follow us
uppula Raju

| Edited By: Rajeev Rayala

Updated on: Jul 25, 2021 | 4:11 PM

VIRAL VIDEO:పెళ్లిళ్లకు సంబంధించిన ఫన్నీ వీడియోలు ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్నింటిని చూస్తే ఆశ్చర్యంగా ఉంటాయి. చాలా వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అవి నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. ఇటీవలి కాలంలో అలాంటి ఒక వీడియో ప్రజలలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై వినియోగదారులు తీవ్రంగా చాట్ చేస్తున్నారు.పెళ్లిలో వధూవరులిద్దరు ఆకర్షణకు కేంద్రమని అందరికి తెలుసు. ప్రస్తుతం వధూవరుల విందుకు సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. దీనిని ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు.

పెళ్లి ఆచారాలు పూర్తయిన తర్వాత వధూవరులు డిన్నర్ టేబుల్ వద్ద కూర్చున్నారు. వరుడు ప్రేమతో వధువుకు గులాబ్ జామ్ తినిపించడానికి ప్రయత్నించడం వీడియోలో చూడవచ్చు. కొంత సేపటికి అది అంత సులభం కాదని వరుడికి తెలుస్తుంది. ఎందుకంటే ప్రతిసారీ గులాబ్ జామ్ వధువు నోటిలో పెట్టడానికి ప్రయత్నించినప్పుడు వధువు ముక్కుకు ఉన్న రింగు అడ్డుపడుతుంటుంది. ఈ కారణంగా వరుడు గులాబ్ జామ్‌ను తినిపించలేకపోతాడు.

సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. చాలా మంది వినియోగదారులు కామెంట్స్‌ చేస్తున్నారు. పెళ్లి యొక్క ఈ వీడియో నిజంగా ఫన్నీ అని ఒక యూజర్ తెలిపాడు. మరోవైపు, వరుడి చాలా శ్రద్ధగలవాడు అని మరొక యూజర్ కౌంటర్ వేశాడు. ఇది కాకుండా చాలామంది వినియోగదారులు ఈ వీడియోను రకరకాలుగా ప్రశంసించారు. ఈ ఫన్నీ వీడియోను నిరంజన్ మోహపాత్రా అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పటివరకు 11 వేలకు పైగా ప్రజలు ఈ వీడియోను చూశారు. అదే సమయంలో ఈ వీడియోకి వేలాది లైక్‌లు వచ్చాయి.

Women Hulchal : పార్వతీపురంలోని ఒక లాడ్జిలో మకాం.. విజయనగరం జిల్లాలో గుజరాతీ మహిళల హల్ చల్

Kaikala Satyanarayana Birthday: సతీసమేతంగా ఇంటికి వెళ్లి నవరస నటనా సార్వభౌముడుని విష్ చేసిన మెగాస్టార్

Balakrishna: వరస సినిమాలతో బాలయ్య బిజిబిజీ … అనిల్ రావిపూడితో సినిమా లేట్ అయ్యే ఛాన్స్